అభిప్రాయం : ఈ పది సినిమాల్లో పందెం గెలిచేది ఏది?

170
Mallesham,Agent Sai Srinivas, Voter, First Rank Raju Films
Mallesham,Agent Sai Srinivas, Voter, First Rank Raju Films
Mallesham,Agent Sai Srinivas, Voter, First Rank Raju Films
Mallesham,Agent Sai Srinivas, Voter, First Rank Raju Films

 

సమ్మర్ సీజన్ లో జెర్సీ నుండి మహర్షి వరకు చాలా సినిమాలు వచ్చాయి.కానీ 2018 లో సమ్మర్ తో పోల్చుకుంటే మాత్రం నిరాశ తప్పలేదు.ప్రస్తుతం సమ్మర్ సీజన్ ఎండింగ్ కి వచ్చింది.అయినా కూడా సినిమాల రిలీజ్ జోరు మాత్రం తగ్గలేదు.ఈ వారం మాత్రం మంచి సినిమాలు,డిఫరెంట్ అనిపించే సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.

వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మల్లేశం.ప్రియదర్శి మెయిన్ లీడ్ గా నటించిన సినిమా.ఆరోతరగతిలో చదువు ఆపేసినా తల్లి కష్టం చూడలేక ఆశు యంత్రం కనిపెట్టి,పద్మశ్రీ అందుకున్న చింతికింది మల్లేశం బయోపిక్ ని చాలా రియలిస్టిక్ గా,సినిమాటిక్ వాల్యూస్ ని పక్కనబెట్టి తెరకెక్కించారు.ఇప్పటికే మీడియా కి ఈ సినిమా చూపించడంతో మంచి సినిమా అనే టాక్ స్ప్రెడ్ అయ్యింది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ…ఈ సినిమా పూర్తవ్వడానికి చాలా టైం పట్టింది.కానీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గరినుండి చాలా తక్కువ టైం లో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది.అందుకే ఈ చిన్న సినిమా ఓవర్సీస్ రైట్స్ కూడా 60 లక్షలకు అమ్ముడు పోయాయి.ఈ సినిమా ట్రైలర్ ఒక డిఫరెంట్ సినిమా చూడబోతున్న అనుభూతిని కలిగించింది.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.ట్రైలర్ లా సినిమా కూడా సటిల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటే మాత్రం పాస్ మార్క్ గ్యారంటీ.

కన్నడ లో మంచి విజయం అందుకున్న ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాని అదే పేరుతో ఇక్కడ రీమేక్ చేసారు.అయితే కన్నడ వెర్షన్ తీసిన సేమ్ టీమ్ రీమేక్ చెయ్యడం,ట్రైలర్స్ లో కాస్త కామెడీ పండడంతో ఈ సినిమా క్లిక్ అయ్యే అవకాశాలు కొట్టిపడెయ్యడానికి లేదు.మరీ ఫస్ట్ క్లాస్ కాకపోయినా బి,సి సెంటర్స్ లో అయినా ఓకే అనిపించుకునే కళ అయితే ఉంది.

అలానే చాలా లేట్ గా ఓటర్ అంటూ రాంగ్ టైం ఎంట్రీ ఇస్తున్నాడు మంచు విష్ణు.రొటీన్ కథ కథనాలు ఉన్నా సినిమాలో మేటర్ ఉంది అనిపిస్తుంది.ఆకట్టుకునేలా ఉంటే ఈ సినిమా కూడా ఒక మోస్తరు గా ఆకట్టుకోవచ్చు.ఇవి కాకుండా మరో అరడజను సినిమాలు కూడా వస్తున్నాయి.అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా లేదు.ఈ నాలుగు సినిమాల్లో రెండు మూడయినా ఆకట్టుకుంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఛాయస్ తో పాటు సరయిన సినిమాలేక,ఫీడింగ్ కోసం అల్లాడుతున్న థియేటర్స్ కి కూడా ఊరటగా ఉంటుంది.మరి ఈ సినిమాలు ఎంతవరకు అంచనాలు అందుకుంటాయి,ఎలాంటి ఫలితాలను అందుకుంటాయి అనేది చూడాలి.