రివ్యూ: ఒరేయ్ బామ్మ‌ర్ది: అక్క‌డ‌క్క‌డా అల‌రించే ‘బావాబామ్మ‌ర్దులు’

0
2571
Orey Baammardhi telugu movie review rating

Orey Baammardhi Review:
విడుదల తేదీ : ఆగస్టు 13, 2021
రేటింగ్ : 2.25/5
తారాగణం: సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్, లిజోమోల్ జోస్, కశ్మీర్ పరదేశి తదితరులు
దర్శకత్వం: శశి
రచన: శశి
సంగీతం : సిద్ధూ కుమార్
ఎడిటర్ : సన్ లోకేష్
సినిమాటోగ్రాఫర్ : ప్రసన్న యస్ కుమార్
నిర్మాత : ఏఎన్ బాలాజీ, రమేష్ పి. పిల్లై.

తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు వారికి ద‌గ్గ‌రైన న‌టుడు సిద్ధార్థ్‌ (Siddharth). కొన్నేళ్లుగా తెలుగు తెర‌పై క‌నిపించ‌ని ఆయ‌న ఇప్పుడు ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కీలక పాత్రలో నటించాడు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ నిర్మాణంలో ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.

‘బిచ్చ‌గాడు’ వంటి హిట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ‌శి నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది. దీనికి త‌గ్గ‌ట్లుగానే టీజ‌ర్‌, ట్రైలర్లు ఆస‌క్తిరేకెత్తించేలా ఉండ‌టంతో ఆ అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

Orey Baammardhi review in telugu

కథ:
రాజశేఖర్ ( సిద్ధార్థ్ ) ఒక సిన్సియర్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్‌. రూల్స్ విష‌యంలో చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. అయితే, లోకల్ గల్లీ రేసర్‌ మదన్ (జీవీ ప్ర‌కాశ్‌) సిటీలో వేరే గ్యాంగ్ తో బైక్ రేసింగిలో పోటీ పడుతూ ఉంటాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న మదన్ ను పట్టుకుని, ఆ స‌మ‌యంలో రాజ్ అత‌నికి ఆడ‌వాళ్ల నైటీ వేసి అంద‌రి ముందు అవ‌మానిస్తాడు. దీంతో రాజ్‌పై ప‌గ పెంచుకుంటాడు మ‌దన్‌. త‌న‌ని అంద‌రి ముందు అవ‌మానించిన అత‌న్ని దెబ్బ‌కు దెబ్బ తీయాల‌ని క‌సిగా ఎదురు చూస్తుంటాడు.

ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం మదన్ అక్క రాజ్యలక్ష్మికి (లిజోమోల్ జోస్) రాజశేఖర్ కి పెళ్ళి కుదురుతుంది. అసలు మదన్ కి రాజ్యలక్ష్మికి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి ? చివరకు రాజశేఖర్ – రాజ్యలక్ష్మి పెళ్లి అవుతుందా ? అలాగే మదన్ – రాజశేఖర్ ఒక్కటవుతారా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.

బ‌లాలు

సిద్ధార్థ్‌.. జీవీ ప్ర‌కాష్ న‌ట‌న‌
ఎంచుకున్న క‌థాంశం
ప్ర‌థమార్ధం

బ‌లహీన‌త‌లు

ద్వితీయార్ధం
క్లైమాక్స్‌

Orey Baammardhi review and rating

నటీనటులు:
ట్రాఫిక్ పోలీస్‌గా రాజ‌శేఖ‌ర్ పాత్రలో సిద్ధార్థ్‌ ఒదిగిపోయాడు. పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా చాలా పరిణతితో న‌టించాడు. బైక్ రేస్‌లంటే ఆస‌క్తి చూపించే ఆవేశ‌ప‌రుడైన యువ‌కుడిగా జి.వి.ప్ర‌కాష్ త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు. జీవీ ప్రకాష్ కుమార్ – సిద్ధార్థ్ మధ్య నడిచే గొడవ, అలాగే సిద్ధార్థ్ – లిజోమోల్ జోస్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది.

త‌మ్ముడిని అమితంగా ప్రేమించే అక్క‌గా రాజీ పాత్ర‌లో లిజోమోల్ చ‌క్క‌టి అభిన‌యాన్ని చూపించింది. క‌శ్మిరా, మ‌ధుసూధ‌న్ పాత్ర‌ల్ని బ‌లంగా తీర్చుదిద్దలేకపోయారు. సిద్ధు కుమార్ స్వ‌రాలు.. ప్ర‌స‌న్న కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

విశ్లేషణ:
బిచ్చ‌గాడు’తో త‌ల్లీబిడ్డ‌ల అనుబంధాన్ని అందంగా ఆవిష్క‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడీ ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’తో బావా బామ్మ‌ర్దుల అనుబంధాన్ని.. అక్కా త‌మ్ముళ్ల ప్రేమానురాగాల‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు. తమిళంలో విజ‌యవంత‌మైన ‘సివ‌ప్పు మంజ‌ల్ ప‌చ్చై’ చిత్రానికి తెలుగు అనువాద‌మిది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గా తన లుక్స్ లో అండ్ తన యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించాడు.

మ‌దన్‌ రేసింగ్ చేస్తూ రాజ‌శేఖ‌ర్‌కు ప‌ట్టుప‌డ‌టం.. అతని నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో క‌థ‌లో వేగం పెరుగుతుంది. అనంత‌రం మ‌దన్‌ని రాజ్ అవ‌మాన‌క‌ర రీతిలో అరెస్ట్ చేయ‌డంతో ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఓవైపు మ‌దన్ త‌న‌కు జ‌రిగిన అవ‌మానానికి ఎలా ప్ర‌తీకారం తీర్చుకుందామా అని ఆలోచిస్తున్న త‌రుణంలోనే.. రాజ్ త‌న ఇంటికి పెళ్లి చూపుల‌కు రావ‌డం.. తొలి చూపులోనే రాజీని పెళ్లి చేసుకోవ‌డానికి ఒప్పుకోవ‌డంతో క‌థ‌లో అనుకోని మ‌లుపు చోటు చేసుకుంటుంది.

Orey Baammardhi 123 telugu review rating

జీవీ ప్రకాష్ కుమార్ – సిద్ధార్థ్ మధ్య నడిచే గొడవ, అలాగే సిద్ధార్థ్ – లిజోమోల్ జోస్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్, సినిమాలో రివీల్ చేసిన ఎమోషనల్ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. మధుసూదన్ రావుతో కలిపి మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

ప్రథమార్ధమంతా బిగితో న‌డిచిన క‌థ‌నం.. ద్వితీయార్ధంలో పూర్తిగా గాడి తప్పుతుంది. మ‌దన్ అనుకోని రీతిలో చైన్ స్నాచింగ్ కేసులో ఇరుక్కోవ‌డం.. బామ్మ‌ర్దిని కాపాడేందుకు రాజ‌శేఖ‌ర్ రంగంలోకి దిగ‌డం.. త‌న పూచీక‌త్తుపై విడిపించుకుని ఇంటికి తీసుకురావడంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌ర‌గ‌బోతుంద‌న్న ఆస‌క్తి పెరుగుతుంది. అదే స‌మ‌యంలో డ్ర‌గ్ డీల‌ర్ మ‌ధుతో రాజ్‌కి పోరు మొద‌ల‌వ‌డంతో సినిమా ఓ థ్రిల్ల‌ర్‌లా మారుతున్న‌ట్లుగా అనిపిస్తుంది. అయితే ఇక్క‌డి నుంచే క‌థపై పూర్తిగా ప‌ట్టుకోల్పోయాడు ద‌ర్శ‌కుడు.

పైగా రొటీన్ వ్యవహారాలతో పాటు సెకండాఫ్‌లో ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ విసుగు తెప్పిస్తాయి. సినిమాలో ప్రధానమైన లిజోమోల్ జోస్ పాత్రను దర్శకుడు పూర్తి పాసివ్ గా నడిపాడు. సినిమా కథనంలో ప్లో కారణంగా కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అయితే, సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ ల నటన, లవ్ ట్రాక్ లో కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినా.. ఇక ఈ చిత్రంలో అవి తప్ప ఇక చెపుకోవటానికి ఏమిలేదు. మొత్తమ్మీద ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోదు.

 

REVIEW OVERVIEW
CB Desk
Previous articleమాస్‌ జాతర రికార్డు దిశగా “పుష్ప” సాంగ్.!
Next articleచిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ప్రారంభం..!