Orey Bujjiga Telugu Movie Review And Rating

ఒరేయ్ బుజ్జిగా సినిమా రివ్యూ (Orey Bujjiga Telugu Movie OTT Review)
రేటింగ్: 2.5/5
నటులు:రాజ్ తరుణ్,మాళవిక నాయర్,హెబా పటేల్,నరేష్,వాణీ విశ్వనాథ్,పోసాని కృష్ణమురళి,సప్తగిరి,మధు నందన్,సత్య,అన్నపూర్ణ,రాజా రవీంద్ర
దర్శకుడు: విజయ్ కుమార్ కొండా

రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఒరేయ్ బుజ్జిగా…’ అచ్చతెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ
భీమవరానికి చెందిన బుజ్జిగాడు (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకే రోజు ఇంట్లో నుంచి పారిపోతారు. వీళ్లిద్దరూ ఒకరికొకరు తెలీదు. కానీ, ఇంట్లో కుదిర్చిన పెళ్లిళ్ల నుంచి తప్పించుకోవడానికి పారిపోతారు. అయితే, ఇద్దరూ ఒకే రోజు జంప్ చేయడంతో ఇద్దరూ కలిసి లేచిపోయారనే రూమర్ ఊరంతా వ్యాపిస్తుంది. ఊళ్లో ఉన్న వీళ్ల కుటుంబ సభ్యులు శత్రువులుగా మారతారు. మరోవైపు, బుజ్జిగాడు శ్రీను పేరుతో.. కృష్ణవేణి స్వాతి పేరుతో ఒకరికొకరు పరిచయమవుతారు. ఆ తరవాత ఏం జరిగింది? కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరకు ఏమైంది? అనేదే సినిమా.

Raj Tarun Orey Bujjiga telugu full movie

రివ్యూ 
ఇదొక కన్‌ఫ్యూజన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా. కానీ పాత ఛాయలు కనిపిస్తాయి. దర్శకుడు విజయ్ కుమార్ గత చిత్రం ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఇన్‌ఫ్లుయెన్స్ ఈ సినిమాపై ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. ఫస్టాఫ్‌ను డీసెంట్ కామెడీతో బాగానే నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ను మాత్రం కాస్త సాగదీసేశారు. కొన్ని సన్నివేశాలను అనవసరంగా చొప్పించారు. వాటి వల్ల సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

Orey Bujjiga Telugu Movie Review And Rating

సెకండాఫ్‌లో వచ్చే హాస్పిటల్ సీన్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సన్నివేశంలో సప్తగిరి, నరేష్ పోటాపోటీగా నటించారు. ఇది మినహా మిగిలిన స్టోరీ రొటీన్‌గానే ఉంటుంది. ప్రేక్షకుడు ఊహించదగినదే. క్లైమాక్స్‌ కూడా గొప్పగా, కొత్తగా ఏమీ లేదు. రొటీన్‌గానే ఉంది. ఈ సినిమాకు ప్రధాన బలం కామెడీ. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు ఆడియన్స్‌ని బాగా నవ్విస్తాయి. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్‌తో బలమైన ఫైట్లు చేయించారు దర్శకుడు. అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.

Orey Bujjiga OTT Review and rating

హీరో రాజ్ తరుణ్ తన స్టైల్లోనే చాలా ఈజ్‌తో నటించారు. ఈ పాత్రకు పర్ఫెక్ట్ సెలక్షన్ ఆయన. కామెడీ టైమింగ్ బాగుంది. ఆయనకి సప్తగిరి, మధు నందన్, సత్య నుంచి మంచి సపోర్ట్ లభించింది. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు బాగా పండాయి. కాకపోతే, ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే.. రాజ్ తరుణ్ ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ ఇదే విధంగా ఉండటం. బుజ్జిగాడిని చూస్తుంటే రాజ్ తరుణ్ గత పాత్రలు మన కళ్ల ముందు కనిపిస్తుంటాయి. రాజ్ తరుణ్ రొటీన్ అయిపోయారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

Orey Bujjiga telugu movie OTT review and rating

ఇక మాళవిక నాయర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారామె. అంతేకాదు, ఆమె కాస్త సన్నబడినట్టు కనిపిస్తున్నారు. హెబా పటేల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. చిన్న పాత్రే అయినా ఆమె న్యాయం చేశారు. పోసాని కృష్ణమురళి, వీకే నరేష్ తమ సీనియారిటీని చూపించారు. ఇక చాలా కాలం తరవాత మళ్లీ తెరపై కనిపించిన వాణీ విశ్వనాథ్.. చాముండేశ్వరి అనే పాత్రలో హుందాతనాన్ని తన నటనలో చూపించారు. సత్య, సప్తగిరి కనిపించిన ప్రతిసారీ నవ్వుకోవడం ఖాయం. మధునందన్, రాజా రవీంద్ర, అన్నపూర్ణ, సత్యం రాజేష్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేర నటించారు.

Orey Bujjiga Review in telugu

సినిమా టెక్నికల్‌గా బాగానే ఉంది. లొకేషన్లను పెద్దగా మార్చకుండా చాలా సింపుల్‌గా గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రెండు మెలోడీలు ఆకట్టుకుంటాయి. నంద్యాల రవి రాసిన మాటలు కొన్ని పేలాయి. ‘మోసపోయినట్టు లేదు ప్రాణం పోయినట్టుంది’ వంటి చిన్న చిన్న మాటలు గుచ్చుకుంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలహీనత కథనం. దాన్ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు నడిపించలేకపోయారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.

చివరిగా: కన్‌ఫ్యూజన్ కామెడీ డ్రామా..!

 

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre