Homeసినిమా వార్తలుఈ ఓటీటీలో ఆస్కార్ అవార్డులు లైవ్ స్ట్రీమింగ్ చూసే అవకాశం.!!

ఈ ఓటీటీలో ఆస్కార్ అవార్డులు లైవ్ స్ట్రీమింగ్ చూసే అవకాశం.!!

When & where to watch the 95th Academy Awards live in India. Oscars 2023 awards live streaming on Disney Plus Hotstar announced through social media

Oscars Awards streaming in OTT: ఆస్కార్ అవార్డ్స్ ఇప్పుడు ఇండియాలో చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ నామినేషన్ లో ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులు మొత్తం ఈ సినిమా అవార్డ్స్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతాయని ఎదురుచూస్తున్నారు.

Oscars Awards streaming in OTT: ప్రతి యేడు అమెరికాలో జరిగే ఈ ఆస్కార్ నామినేషన్స్ అలాగే అవార్డ్స్ చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. సినీ ప్రేమికులే కాకుండా ప్రేక్షకులు కూడా వీటిని అలరిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచంలో ఉన్న సినీ ప్రేమికులు ఈ అవార్డ్స్ గురించి అమెరికాకు కూడా వెళ్తారు. ఆర్ఆర్ఆర్ మూవీ నామినేషన్ లో ఉంటం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ అమెరికాకి బయలుదేరి వెళ్ళటం జరిగింది.

అయితే ఈసారి ఆస్కార్ అవార్డ్స్ ని అందరూ లైవ్ చూసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. దీనికోసం అని ప్రముఖమైన ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నమస్తే తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. అలాగే దీని గురించి సోషల్ మీడియా వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ప్రకటించడం కూడా జరిగింది.

మార్చి 12న అమెరికాలో జరిగే ఈ ఆస్కార్ అవార్డ్స్ ని మన భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 5 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. దీని గురించి అఫీషియల్ గా ప్రకటిస్తూ “సినిమాలు మీరు ఎప్పటికీ మరచిపోలేని డ్రీమ్స్. 95వ ఆస్కార్స్ లో డ్రీమ్ మేకర్స్ ను సెలబ్రేట్ చేయండి” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేసుకుంది.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY