ఈ వారంలో వచ్చే OTT మూవీస్

0
2322
This week OTT Release movies Toofaan and Malik and Kudi Yedemaithe

This week OTT Movie Releases: కరోనా ఫస్ట్ వేవ్ తగ్గింది.. ఫిల్మ్ ఇండస్ట్రీ పుంజుకుంటోంది అని అనుకునేలోపే.. సెకండ్ వేవ్ వచ్చిన మొత్తం తలక్రిందులు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల కరోనా కారణంగా ఇంకా థియేటర్లు తెరుచుకోని పరిస్థితి. దీంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ (OTT) బాటపడుతున్నాయి.

ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. పలు చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ సైతం మొదలయ్యాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయో చూద్దామా!

మాలిక్‌(మలయాళం)

Malik streeming on Amazon prime from July 15

మాలిక్ రాబోయే భారతీయ మలయాళ భాషా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం, మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించి, సవరించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అంటో జోసెఫ్ నిర్మిస్తున్నారు. తాను నటించిన చిత్రాలను వరుసగా ఓటీటీలో విడుదల చేస్తూ, ప్రేక్షకులకు మరింత దగ్గరైన విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌. రూ.30కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్‌లలోనే విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జులై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తుఫాన్‌(హిందీ)

toofaan ott release from July 20

తూఫాన్ రాకీష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించబోయే భారతీయ హిందీ భాషా స్పోర్ట్స్ డ్రామా చిత్రం మరియు జాతీయ స్థాయి బాక్సర్‌గా ఫర్హాన్ అక్తర్ నటించారు, మృణాల్ ఠాకూర్ మరియు పరేష్ రావల్ తో పాటు సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 20 జూలై 2021 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇందులో ఫర్హాన్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఎప్పుడో ‘బాగ్‌ మిల్కా బాగ్‌’ లాంటి స్పోర్ట్స్‌ డ్రామాలో అలరించిన ఫర్హాన్‌ మరోసారి అదే జానర్‌లో సినిమా చేస్తుండటంతో ఆసక్తి నెలకొంది.

కుడి ఎడమైతే (తెలుగు)

Amala Paul Kudi Yedamaithe To Premiere on July 16 on Aha OTT

అమలాపాల్ – రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ‘కుడి ఎడమైతే” ఈ సిరీస్ ను జూలై 16 నుండి 100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఎమోషన్స్ – థ్రిల్స్ – సైంటిఫిక్ ఎలిమెంట్స్ కలబోసిన ఈ టైమ్ లూప్ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 16న ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపిస్తుండగా.. రవి ప్రకాష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

నెట్‌ఫ్లిక్స్‌

 యానిమల్‌ కింగ్‌ డమ్‌: జులై 12, 2021

 నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌ ఎస్‌2: జులై 15, 2021

 గన్‌పౌడర్‌ మిల్క్‌షేక్‌: జులై 14, 2021

 ఫియర్‌ స్ట్రీట్‌3: జులై 16, 2021

డిస్నీ+ హాట్‌స్టార్‌

 ది వైట్‌ లోటస్‌: జులై 13, 2021

 క్యాచ్‌ అండ్‌ కిల్‌-ది పాడ్‌ క్యాస్ట్‌ టేప్స్‌: జులై 13, 2021

సోనీ లైవ్‌

 వాజా: జులై 16, 2021

హెచ్‌బీవో మ్యాక్స్‌

 స్పేస్‌ జామ్‌-ఏ న్యూ లెగసీ: జులై 16, 2021