ఓటీటీ రివ్యూ : “మిడిల్ క్లాస్ మెలోడీస్”

0
1557
OTT Review_ Anand Devarakonda Middle Class Melodies

OTT Review: Anand Devarakonda Middle Class Melodies
విడుదల తేదీ : నవంబర్ 20th,2020
Rating : 3/5
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ త‌దిత‌రులు
దర్శకత్వం : వినోద్‌ అనంతోజు
సంగీతం : స్వీకర్ అగస్తి
స్క్రీన్ ప్లే : వినోద్‌ అనంతోజు
నిర్మాత : వెనిగళ్ల ఆనంద ప్రసాద్

ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై యువ హీరో ఆనంద్ దేవరకొండ, యువ హీరోయిన్ వర్ష బొల్లమ్మ జంటగా యువ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం విడుదలకు ముందే మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. వాస్తవానికి థియేటర్లలో రిలీజ్ కావాల్సిన చిత్రం లాక్‌డౌన్ కారణంగా నవంబర్ 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :
రాఘవ (ఆనంద్ దేవరకొండ) తన తండ్రి (గోపరాజు రమణ), తల్లి (సురభి ప్రభావతి) నిర్వహించే హోటల్‌‌లో చేదోడువాదోడుగా ఉంటాడు. అయితే రాఘవకు చిన్నప్పటి నుండే గుంటూరులో హోటల్ పెట్టి.. దాన్ని సక్సెస్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. పల్లెలో హోటల్ వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో గుంటూరు టౌన్‌లో మరో హోటల్‌ను తెరువాలనుకొంటాడు. ఈ మధ్యలో స్కూల్ డేస్ నుండే అతని మరదలు సంధ్య (వర్షా బొల్లమ్మ) లవ్ ఇంట్రస్ట్ ఉంటుంది.

హోటల్‌ను తెరువడానికి తన కుటుంబానికి చెందిన పొలాన్ని తాను ప్రేమించిన సంధ్య (వర్ష బొల్లమ్మ) తండ్రికి అమ్మేయడం, ఆ తర్వాత వెంటనే దానికి ధరకు రెక్కలు వస్తాయి. గుంటూరులో హోటల్ ప్రారంభించడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తాను ప్రేమించిన సంధ్యను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది? చివరకు వీరు ఒక్కటయ్యారా ? లేదా ? అయితే ఎలా అయ్యారు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
తండ్రి చాదస్తాన్ని భరిస్తూ సొంత కాళ్లమీద ఎదగాలనే రాఘవ అనే యువకుడి కథతో సినిమా మొదలవుతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆనంద్ దేవరకొండ, అతని తండ్రి పాత్రలో నటించిన నటుడు గోపిరాజు రమణ మరియు వర్షా బొల్లమ్మ ఈ ముగ్గురు తమ నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాత్రలను చకచకా పరిచయం చేయడం ద్వారా దర్శకుడు కథలో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. గుంటూరులో హోటల్ పెట్టడానికి పొలం అమ్మకం విషయంలో కొన్ని ట్విస్టులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి.

ఇక సినిమాలో కామెడీ సన్నివేశాలు.. అదేవిధంగా హీరో హోటల్ బిజినెస్ అనుకోని సంఘటనలతో సమస్యల వలయంలో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే వాళ్ళు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. అలాగే తన ప్రియురాలికి వారి తల్లిదండ్రులు సంబంధాలు చూడటం లాంటి అంశాలు సినిమా రెండో భాగానికి కొంత బలాన్ని చేకూరుస్తాయి.

ఆ సన్నివేశాల్లో ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు. మిగిలిన కీలక పాత్రల్లో కనిపించిన నటులు కూడా తమ కామెడీ టైమింగ్‌ తో నవ్వించారు. ఇక కామెడీ కంటెంట్ సినిమాకే హైలెట్ నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. ఓ చక్కటి అంశంతో కథను సుఖాంతం కావడం సినిమాకు ఫీల్‌గుడ్‌గా మారుతుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు వినోద్‌ అనంతోజు ఈ కథలో బలమైన సన్నివేశాలు, లవ్ ట్రాక్‌లో కొత్తదనం కొరవడం సినిమా రొటీన్‌గా అనిపిస్తుంది. స్క్రిప్టు పరంగా మరికొంత శ్రద్ద పెట్టి ఉంటే డెఫినెట్‌గా ఓ మంచి నేటివిటి చిత్రంగా మారి ఉండేదనే ఫీల్ కలుగుతుంది. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.

కథలో ఎమోషన్స్, హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్‌ను మరింత మెరుగ్గా తెరకెక్కించాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు. ఇక హీరోయిన్ – ఆమె తండ్రి మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ సింఫుల్ గా ముగించారు. కథను చెప్పే విషయంలో ఎలాంటి తడబాటు కనిపించలేదు కానీ.. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ఎలిమెంట్స్ లేకపోవడం కొంత మైనస్ అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

ఇక తెర వెనుక అంశాలకు వస్తే.. డైలాగ్స్ చాలా సహజసిద్ధంగా ఉన్నాయి. కొన్ని కామెడీ సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని కంటెంట్ ను దర్శకుడు బాగా తెరకెక్కించారు. అగస్తీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆయన అందించిన పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. పల్లె అందాలను చక్కగా తెరపైన చూపించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. భవ్య క్రియేషన్స్ స్థాయికి తగినట్టు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి.

తీర్పు :

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా విషయానికి వస్తే.. సింపుల్‌గా ఆకట్టుకొనే క్యూట్ స్టోరి. కమర్షియల్‌ విలువలకు కాస్త దూరంగా అత్యంత సహజసిద్ధంగా, పల్లెటూరు, మట్టి వాసన ప్రతిబింబించే కాన్సెప్ట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను నెమ్మదిగా నడిపారు. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో ఓ సీక్వెన్స్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. ఐతే అతని తండ్రి పాత్రలో నటించిన నటుడు మరియు వర్షా బొల్లమ్మ తమ నటనతో సినిమాలో బాగా అలరించారు. అసభ్యత, అశ్లీలత లేని క్లీన్ గ్రీన్ చిత్రమని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అంచనాలు లేకుండా మంచి గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాను కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

REVIEW OVERVIEW
Chitrambhalare
Previous articleఅలీ కుటుంబం నుండి నట వారసుడు సదన్ ‘భారీ తారాగణం’ చిత్రం ప్రారంభం!
Next articleరష్మికకు గూగుల్ సర్‌‌ప్రైజ్ అరుదైన గుర్తింపు..!