ott telugu movies seriously frustrating to movie lover

ott telugu movies: ఇటీవల కాలంలో ఓటీటీ డిజిటల్‌ ప్లాట్‌పామ్‌లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. దీంతో అందులో రిలీజయ్యే సినిమాలపై అంచనాలు తగ్గిపోతున్నాయి. జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్.. వెబ్ సిరీస్ లు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ మూతబడిపోవడంతో కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ సీజన్లో ఓటీటీల ద్వారా విడుదలైన ఏ సినిమాకు సరైన రెస్పాన్స్ రాకపోవడం షాకింగ్‌కు గురిచేస్తోంది. గత నెలలో విడుదలైన నాని ‘వి’ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా విడుదలైన ఒరేయ్ బుజ్జిగా, నిశ్శబ్ధం సినిమాలకు కూడా అదే టాక్ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ టీమ్ సినిమాలను తీసుకునే విషయంలో లోపం ఎక్కడ జరిగిందో వెతికే పనిలో పడ్డారట. తెలుగు సినిమాలకి సంబంధించి ఇక్కడ లోకల్ గా అమెజాన్ టీమ్ ని ఎవరు గైడ్ చేస్తున్నారో కానీ.. డైరెక్ట్ ఓటీటీ రిలీజుల విషయంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారని కామెంట్స్ వస్తున్నాయి.

థియేటర్లలో రిలీజ్ చేస్తే కచ్చితంగా ప్లాప్ అవుతాయన్న సినిమాలను ఓటీటీలకు అమ్మేసి నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ అందించాలన్న ఉత్సాహంతో ఓటీటీ సంస్థలు అడ్డగోలుగా సినిమాలను కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నాయని అంటున్నారు. ఏ సినిమాని కొనాలి? ఏ సినిమాకి ఎంత పెట్టొచ్చు? అనే విషయాలపై అవగాహన లేకపోవడంతో ఇలా జరుగుతుందని.. ఇలానే కొనసాగితే తెలుగు సినిమాల్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడంలో కొన్నాళ్లు ఆపేయవచ్చని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.