Homeట్రెండింగ్బాలయ్య సినిమాకు మించి వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ బిజినెస్ డీల్..!!

బాలయ్య సినిమాకు మించి వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ బిజినెస్ డీల్..!!

Veera Simha Reddy – Walteru Veerayya overseas Business: చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సంక్రాంతి పాత కల వచ్చింది. చిరంజీవి అలాగే బాలకృష్ణ రాబోయే సంక్రాంతికి 2023 తమ సినిమాలోని రెడీ చేస్తున్నారు, చిరంజీవి అలాగే బాలకృష్ణ రాబోయే సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సంబంధించి ఓవర్సీస్ బిజినెస్ డీల్ పూర్తయింది.

Veera Simha Reddy – Walteru Veerayya overseas deal: 2017 సంక్రాంతి తర్వాత మళ్లీ చిరంజీవి అలాగే బాలకృష్ణ 2023 లో పోటీ పడుతున్నారు. వీళ్లిద్దరు సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ ఒకే నిర్మాణ సమస్త అయిన మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సంబంధించి ఓవర్సీస్ హక్కులను కూడా ఒకే సంస్థకు కట్టబెట్టింది.

ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ యుఎస్‌లో చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. అయితే ఈ సంస్థ ఈ సినిమాని 7 కోట్లకు కొనుగోలు చేయగా.. బాలకృష్ణ సినిమా ని 4 కోట్లకు కొనుగోలు చేసింది.

Balakrishna Veera Simha Reddy overseas Business Deal
Balakrishna Veera Simha Reddy overseas Business Deal

ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ కావాలంటే ‘వాల్తేరు వీరయ్య’ 2 మిలియన్ డాలర్లు రాబట్టాలి. అలాగే బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’ మిలియన్ డాలర్ల మార్కును అందుకోవాలి. బాలకృష్ణ కి మొదటి నుంచి యుఎస్‌లో మార్కెట్ తక్కువే కనుక ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2015 మార్కెట్కు పోల్చుకుంటే ఇప్పుడు బాలకృష్ణ మార్కెట్ యుఎస్‌లో ఎక్కువనే చెప్పాలి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలయ్య సినిమా ‘వీరసింహారెడ్డి’ మీద చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు 50 శాతం అయినా ఎక్కువ బిజినెస్సే జరగొచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

Chiranjeevi Walteru Veerayya overseas Business deal
Chiranjeevi Walteru Veerayya overseas Business deal

వీటితో పాటు సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వస్తున్న అఖిల్ సినిమా ఏజెంట్, అలాగే దళపతి విజయ్ వారసుడు సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ విజయ్ వారసుడు రైట్స్ ని సొంతం చేసుకుంది. మరి మొత్తం మీద సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏది విన్నర్ గ నిలుస్తుందో చూడాలి.

- Advertisement -

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY