విశ్వక్ సేన్ ‘పాగల్’ టీజర్

365
Paagal Teaser -Vishwak Sen Naressh Kuppili April 30th Release
Paagal Teaser -Vishwak Sen Naressh Kuppili April 30th Release

టాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పేరు తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ సేన్ తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దష్టి ఆకర్షించారు.

 

 

ఆ తరువాత ఫలక్‌నామా దాస్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాతో మాస్‌కా దాస్ అనే పేరును తెచ్చుకున్నారు. వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు. అయితే విశ్వక్ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.

 

 

ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న సినిమా పాగల్.ఈ సినిమాను నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. అయితే పాగల్ టీమ్ ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో విశ్వక్ సేన్‌ను ఎంతో రొమాంటిక్‌గా చూపించారు. ‘రేయ్.. ఎవర్రా.. నా లవర్‌ని ఏడిపించింది’ అనే డైలాగ్‌తో విశ్వక్ ఎంట్రీ ఇచ్చారు.

 

ఈ టీజర్‌ రొమాంటిక్ మ్యూజిక్‌తో మొదలవుతోంది. ఇందులో విశ్వక్‌ను పక్కా లవర్ బాయ్‌గా చూపించారు.  టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.