విశ్వక్‌ సేన్‌ `పాగల్‌` మూవీ రివ్వూ..!

0
1005
Vishwak Sen Paagal Movie Review And Rating

Vishwak Sen Paagal Movie Review And Rating 
రేటింగ్ : 2.5/5
తారాగణం: విశ్వక్ సేన్, నివేత పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘ లేఖ, మురళీ శర్మ
దర్శకత్వం: నరేష్ కుప్పిలి
సంగీతం : రాధన్
ఎడిటర్ : గ్యారీ బి హెచ్
నిర్మాత : బెక్కెం వేణుగోపాల్

ఫలక్ నుమా దాస్, HIT వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చాడు విశ్వక్ సేన్. అలాంటి విశ్వక్ సేన్ పూర్తి లవర్ బాయ్‌లా మారి పాగల్ అంటూ నేడు (ఆగస్ట్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ పాగల్ ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించాడో ఓ సారి చూద్దాం.

కథ :
ఇక కథలోకి వచ్చినట్టయితే ప్రేమ్(విశ్వక్ సేన్) తన తల్లి(భూమిక) తో తన చిన్న వయసులో ఎంతో ప్రేమతో కూడా అనుబంధం ఏర్పర్చుకుంటాడు. తన తల్లి అంటే ఎంతో ఇష్టం ప్రేమ ఉన్నా దురదృష్టవశాత్తు ఆమె కాన్సర్ తో చనిపోతుంది. ఎవరినైనా మనం ప్రేమిస్తే వాళ్ళు మనని తిరిగి ప్రేమిస్తారు అని తన తల్లి చెప్పడంతో మళ్ళీ తన అమ్మలా ప్రేమించే తోడు కోసం వెతుకుతాడు. అప్పటి నుంచి దాదాపు 1600 మంది అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తాడు ప్రేమ్.

Vishwak Sen Paagal Movie Review in telugu

కానీ అందులో ఏ ఒక్కరు కూడా అతని ప్రేమను అంగీకరించరు. దీనితో జీవితంపై విసుగు చెందిన ప్రేమ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే లాస్ట్ కి తీరా(నివేతా పెత్తురాజ్) ప్రేమ్ ప్రేమని ఓకే చేస్తుంది. మరి వీరి ప్రయాణం ఎంత వరకు వెళ్తుంది? ప్రేమ్ కి మళ్ళీ తన తల్లి దగ్గర లాంటి ప్రేమ తీరా నుంచి దొరుకుతుందా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

నటీనటులు:
ఈ సినిమా కి 2 గంటల 15 నిమిషాల లెంత్ ఎక్కువ లెంత్ లా అనిపించింది. విశ్వక్ సేన్ తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడు. ఎంటర్ టైన్ మెంట్ అందించడం విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు. నివేతా పేతురాజ్ ఈ సినిమాలో అందంతో మాత్రమే కాక నటనతో కూడా చాలా బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ తో తన కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది.

Paagal telugu Movie Review 123 telugu

సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖ కు కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. భూమిక చావ్లా కు సినిమాలో కీలక పాత్ర దొరికింది. ఆ పాత్రకు పూర్తి న్యాయం సమకూర్చారు చేశారు భూమిక. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళి శర్మ కూడా బాగానే ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా బాగానే నటించారు.

విశ్లేషణ:
మొదటగా మాస్ కా దాస్ విశ్వక్ కోసమే మాట్లాడినట్టయితే తన గత చిత్రాలతో విశ్వక్ లో మరింత మెరుగైన నటన కనిపిస్తుంది. సినిమా అంతా చాలా ఫ్రెష్ లుక్ లో మంచి ఎనర్జిటిక్ గా సినిమా అంతా సేన్ ఒక్కడై నడిపిస్తాడు. కథ చెప్పాలి అంటే చాలా చిన్న లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా కి 2 గంటల 15 నిమిషాల లెంత్ ఎక్కువ లెంత్ లా అనిపించింది. ఇక హీరోయిన్స్ లో నివేత కి బెస్ట్ రోల్ దక్కగా తన పాత్రను బాగా తెరకెక్కించారు. నివేతా తో కెమిస్ట్రీ కానీ ప్రపోజ్ చేసే సన్నివేశాల్లో కానీ మంచి కెమిస్ట్రీ, ఫన్ వే లో బాగా కనిపించాడు. అలాగే నివేతా తన రోల్ మేరకు డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచింది.

Nivetha Pethuraj Paagal telugu Movie Review

ఫస్టాఫ్ వరకు అక్కడక్కడా కొన్ని సీన్స్ ఎంటర్ టైన్ చేసినప్పటికీ ఒక స్టేజ్ దాటాక కొంచం బోర్ ఫీల్ అవుతాం, కానీ ఓవరాల్ గా ఫస్టాఫ్ బాగానే మెప్పించగా సెకెండ్ ఆఫ్ ఇంకా బెటర్ గా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ సెకెండ్ ఆఫ్ స్లో నరేషన్ తో సెంటిమెంట్ సీన్స్ తో నిండిపోయింది. ఇక దర్శకుడు నరేష్ మంచి ఎమోషనల్ అండ్ లవ్ డ్రామా కథను ఎంచుకున్నాడు కానీ దానిని సమర్ధవంతంగా హ్యాండిల్ చెయ్యడంలో తడబడ్డాడు అని చెప్పాలి.

అలాగే సెకండాఫ్ లో చాలా సీన్స్ లాజిక్స్ లేకపోవడం కొన్ని సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. వాటి మూలాన కాస్త డల్ గా అనిపిస్తుంది.. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో చూస్తే సెకండాఫ్ అంత ఇంపాక్ట్ కలిగినట్టుగా అనిపించదు.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉండగా సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ మెప్పించాగా డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి, సింగిల్ లైన్ డైలాగ్స్ కొన్ని చోట్ల బాగా పేలాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. కానీ సరైన విధంగా ఎమోషన్స్ ని జోడించకపోవడం డైరెక్టర్ స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా ఉండకపోవడం ఆడియెన్స్ కి అంత ఎంగేజింగ్ గా అనిపించకపోవచ్చు. కానీ విశ్వక్ సేన్ కోసం కొన్ని నవ్వులు, అక్కడక్కడా ఎమోషన్స్ కోసం అయితే ఈ పాగల్ ని ఓసారి చూడొచ్చు.

 

REVIEW OVERVIEW
CB Desk
Previous articleSumanth’s Character Revealing Poster From Malli Modalaindi is Out
Next articleHey Nee Valle Nee Valle Song From Ichata Vahanamulu Niluparadu