Kiccha Sudeep, Pailwaan Movie, Pailwaan Review, Telugu News
Kiccha Sudeep, Pailwaan Movie, Pailwaan Review, Telugu News

విడుదల తేదీ : సెప్టెంబరు 12, 2019
రేటింగ్ : 2.5/5
నటీనటులు : కిచ్చా సుధీప్,సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్,సుశాంత్ సింగ్ తదితరులు.
దర్శకత్వం : కృష్ణ
నిర్మాత‌లు : స్వప్న కృష్ణ
సంగీతం : అర్జున్ జ‌న్యా
సినిమాటోగ్రఫర్ : కరుణాకర్ ఏ
ఎడిట‌ర్‌ : రూబెన్‌
స్క్రీన్ ప్లే : కృష్ణ ,డి ఎస్ కణ్ణన్, మధో

క‌న్న‌డ‌లో స్టార్ హీరో రాణిస్తున్న కిచ్చా సుదీప్ హీరోగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ప‌హిల్వాన్‌’. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టితో పాటు కీల‌క పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రానికి అర్జున్ జ‌న్యా సంగీతం అందించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో నిలబడుతుందో రివ్యూను పరిశీలిద్దాం.

కథ :

సర్కార్ (సునీల్ శెట్టి) ఓ కుస్తీ వీరుడు.. కుస్తీ కోసం జీవితాన్నే త్యాగం చేసి.. విలువలకు కట్టుబడ్డ ఓ మంచి వ్యక్తి. ఇక ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ (కిచ్చా సుదీప్) ఓ అనాధ. ఎదుటివారి కోసం పోరాడే స్వభావం ఉన్న ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ను చూసి సర్కార్ ఇష్టపడతాడు. కృష్ణను చిన్నప్పటి నుండి కన్న కొడుకులా పెంచి కుస్తీ వీరుడిగా తయారుచేస్తాడు. కృష్ణ దేశం తరుపున మెడల్ సాధిస్తాడని బలంగా నమ్ముతాడు. అయితే ఈ క్రమంలో ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ రుక్మిణీ (ఆకాంక్ష సింగ్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ‘కృష్ణ’ రుక్మిణీ పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఆ రకంగా సర్కార్ కి, కుస్తీకి కృష్ణ దూరం అవుతాడు. తన భార్యతో ఎక్కడో దూరంగా వచ్చి బతుకుతాడు. అయితే ఆ తరువాత ‘కృష్ణ’ మళ్లీ ‘ప‌హిల్వాన్‌’గా మారాల్సిన అవసరం వస్తోంది ? ఏమిటి అవసరం ? ఈ క్రమంలో సర్కార్ మరియు కృష్ణ కలిశారా ? అసలు కుస్తీ వీరుడు బాక్సింగ్ కి సంబంధం ఏమిటి ? ఇంతకీ ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ బాక్సింగ్ లో గెలిచాడా ? లేదా ? గెలిస్తే ఏ ఆశయం కోసం గెలిచాడు ? అనేదే మిగితా కథ.

నటీనటులు:

‘ప‌హిల్వాన్‌ కృష్ణ’గా కుస్తీ వీరుడి పాత్ర‌లో కిచ్చా సుదీప్ చాల బాగా నటించాడు. ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ప్లేలోని ఇంట్రస్ట్ ను తన యాక్టింగ్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే బాక్సింగ్ సీన్ లో సుదీప్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన సునీల్ శెట్టి కూడా ఎప్పటిలాగే చాల బాగా నటించాడు. ఆయన చేత చెప్పించిన డైలాగ్స్ కూడా బాగా అలరిస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆకాంక్ష సింగ్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో మరియు లవ్ సీన్స్ లో ఆమె నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక ఒక కుస్తీ వీరుడు బలమైన ఆశయంతో బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో.. మంచి మెసేజ్ తో పాటు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. మెయిన్ గా దర్శకుడు చెప్పాలనుకున్న థీమ్ తో పాటు సినిమాలో స్పోర్ట్స్ లవర్స్ కి నచ్చే అంశాలు బాగున్నాయి.

టెక్నీషియన్స్:

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడు కృష్ణ మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథకథనాన్ని రాసుకోలేకపోయారు. అయితే మంచి నేపథ్యంలో ఆసక్తికరమైన పాత్రలతో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా స్క్రీన్ ప్లేని నెమ్మదిగా నడిపించి బోర్ కొట్టించారు. కరుణాకరన్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత స్వప్న కృష్ణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. మొత్తానికి దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి. దానికి తోడు సీరియ‌స్ గా యాక్షన్ డ్రామా కావడంతో బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్‌ ప్రైజ్‌లు మిస్ అయ్యాయి. సినిమాలో మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి గాని, అవి పెద్దగా ఎలివేట్ కాలేదు. ఓవరాల్ గా సినిమాలో మంచి స్కోప్ ఉన్నప్పటికీ ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో.. కానీ దర్శకుడు మాత్రం తను అనుకున్న యాక్షన్ డ్రామానే ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. పైగా కాస్త స్లోగా, లెంగ్తీగా సాగడం కూడా సినిమాకు మైనస్‌ పాయింట్స్ గా నిలుస్తాయి.

ఫైనల్ గా:

క‌న్న‌డ‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న కిచ్చా సుదీప్ హీరోగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రం బలమైన నేపథ్యంతో, భావేద్వేగమైన యాక్షన్ డ్రామాగా, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకునప్పటికీ… స్టోరీ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం, సినిమా ఆసక్తికరంగా సాగకపోవడం వంటి అంశాల వల్ల సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. మొత్తంమీద ఈ సినిమా స్పోర్ట్స్ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు అలరిస్తోందో చూడాలి. ఓవరాల్ గా అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడటం కష్టమే.

బోటమ్ లైన్: ‘ప‌హిల్వాన్‌’ ఆశయం బాగున్నా.. ఆసక్తికరంగా సాగడు !