Bigg Boss 7 Second elimination: బిగ్ బాస్ సీజన్ 7 మొదలయి రెండు వారాలు అవుతుంది నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ షోలో మొదటి దగ్గర నుంచి ఉల్టా పల్టా అంటూ చెప్పుకు రావటం జరిగింది. అయితే రెండు వారాలు గడిచినప్పటికీ బిగ్ బాస్ 7 షోలో ఎటువంటి మార్పులు చూడలేదు. ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ వచ్చేసరికి ఏకంగా ముగ్గురిని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
bigg boss 7 second week elimination: ఇక వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ 7 రెండవ వారం గొడవలతో అలాగే టాస్క్ తో మొదటి వారం కన్నా కొంచెం ఆసక్తికరంగా నడిచింది అని చెప్పాలి. రెండో వారం ఎలిమినేషన్ వచ్చేసరికి హౌస్ నుండి ముగ్గురిని చేస్తున్నట్టు లీక్ అయితే వచ్చింది.. ఈ ఎలిమినేషన్ లో మొదటిగా పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth Elimination) ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత షకీలా అలాగే శోభా శెట్టి ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇదే గనుక జరిగితే ఒక వారంలో ముగ్గుర్ని ఎలిమినేట్ చేయడం అంటే బిగ్ బాస్ హిస్టరీలో ఇదే తొలిసారి అవుతుంది.
ఈవారం ఎలిమినేషన్ లో ఉన్న 9 మందిలో ప్రశాంత్ కి ఎక్కువ ఓటింగ్ రావటం జరిగింది. దానితోపాటు కొన్ని అన్ అఫీషియల్ పోల్స్‌లో అయితే పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈవారం మొదటి రోజులోనే అమర్ దీప్ అండ్ కో సీరియల్ బ్యాచ్ మొత్తం పల్లవి ప్రశాంత్‌ని టార్గెట్ చేసి నామినేషన్ లో ఉంచడం జరిగింది.
రైతు బిడ్డ అంశాన్ని తెరపైకి తెచ్చి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకు ముందు రైతు బిడ్డలా ప్రవర్తించిన పల్లవి ప్రశాంత్‌ను ఎవరూ పట్టించుకోలేదు కానీ.. టార్గెట్‌గా మారడంతో ఒక్కసారిగా అతడిపై సానుభూతి పెరిగింది. పల్లవి ప్రశాంత్ పోలింగ్ లో సీరియల్ పార్టీని పక్కకు నెట్టి అకస్మాత్తుగా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాడు.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం పల్లవి ప్రశాంత్ ఈ వారం ఎలిమినేట్ అవుతాడు అని, పెద్ద ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో బాగా ఆడుతున్న వారిలో పల్లవి ప్రశాంత్‌ను ఎలిమినేట్ చేయడం ఏమిటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ కూడా కావాల్సింది ఇదే కదా.. దాంతో పల్లవి ప్రశాంత్‌ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌కి పంపిస్తారా అని డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ మూడో సీజన్‌లో అతన్ని ఎలిమినేట్ చేయడంతో షాక్ అయ్యాడు. అనంతరం అతడిని రహస్య గదిలోకి పంపించారు. సీక్రెట్ రూమ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఆట తీరు మారిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ మళ్లీ హాల్‌లోకి ప్రవేశించి టైటిల్ గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే… రెండో వారం కాబట్టి. మరి ఉల్టా ఫల్టాగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి.