ఆదిపురుష్ కోసమే స్లిమ్ లుక్‌లోకి ప్రభాస్

0
465
Pan India Star Prabhas Turned Into A Slim Look For Adipurush movie

రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆరడగులకు పైగా ఎత్తు, కండలు తిరిగిన దేహంతో బాహుబలిగా కనిపించే ప్రభాస్ కొత్త లుక్‌ చూసి అందరూ అవాక్కవుతున్నారు. తాజాగా బయటికొచ్చిన ఫోటోలో సన్నగా, ఫిట్‌గా కనిపిస్తున్నాడు.

ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటలీలో ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేస్తున్నారు. దీనికోసమే ఏకంగా రూ.30కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. కాగా దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్‌ ఆదిపురుష్‌ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ విలువిద్యను సైతం నేర్చుకుంటున్నారు. 3డీలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం

ఆ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్అశ్విన్ దర్శకత్వంతో ఓ సినిమాతో పాటు పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్’లోనూ ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఆ సినిమాల కోసమే ప్రభాస్ స్లిమ్ లుక్‌‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు, హిందీలో ఏకకాలంలో తెరకెక్కించనున్న ఈ మూవీని మిగిలిన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.