వైష్ణవ్ తేజ్ కోసం రంగంలోకి దిగిన త్రివిక్రమ్..!!

0
3990
Panja Vaishnav Tej movie in Crazy Banners
Panja Vaishnav Tej movie in Crazy Banners

Panja Vaishnav Tej New Movie: `ఉప్పెన` ప్రత్యేకమైన సినిమాగా రికార్డు సాధించింది. ఈ మూవీ తరువాత `కొండ పొలం`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు నేడు. త్వరలో ఆయన రెండు క్రేజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఒకటి బీవీఎస్ ఎప్ ప్రసాద్ నిర్మిస్తుండగా మరో చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఫార్చూన్ 4 సినిమాస్ పై చేస్తున్నారు.

నేడు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య. ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో నిర్మితమవుతున్న ‘సార్’, నవీన్ పోలిశెట్టి హీరో గా మరోచిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘ డిజే టిల్లు’, చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మిత మవుతున్న విషయం విదితమే.

 

Previous articleDaksha Nagarkar Latest Stills
Next articleపవన్ సినిమా సీక్రెట్ బయటపెట్టిన నిధి అగర్వాల్..!!