Master Digital Rights: తమిళ స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి సినిమా వచ్చిదంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. తమిళ దళపతి విజయ్, లోకేష్ కనగ్ రాజ్ కలయికలో ‘మాస్టర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పడు కోలీవుడ్లో అందరి దృష్టి ‘మాస్టర్’పైనే ఉంది. మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ‘ఖైదీ’తో ఇండస్ట్రీకి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడంతో ‘మాస్టర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో విజయ్ సరికొత్తగా కనిపించాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టీజర్ విడుదలైన గంటల వ్యవధిలోనే ఎక్కువ మంది వీక్షించిన టీజర్ గా రికార్డు సృష్టించింది.
ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ‘మాస్టర్’ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. రీసెంట్ గా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ ఆసక్తిని రేపుతోంది. ‘మాస్టర్’ లాంటి భారీ బడ్జెట్ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, ఓటీటీ వైపు వెళ్లే ఆలోచన లేదని నిర్మాతలు గతంలోనూ ప్రకటించారు. ఇప్పటికే మాస్టర్ మూవీకి అనేక ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్స్ వచ్చాయని, అందుకు నిర్మాతలు అంగీకరించలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తాలూకు డిజిటల్ రైట్స్ ను నిర్మాతలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కు విక్రయించారని సమాచారం.
‘మాస్టర్’ ఏకంగా రూ.100కోట్లకు నెట్ఫ్లిక్స్ కి అమ్మేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి అంత బాగోలేదు. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరిచినా ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం లేదు. కాకపోతే మొదట సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ కు అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతినిధులు కూడా అంగీకరించారని సమాచారం. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘మాస్టర్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు విజయ్.