సర్కారు వారి పాట ఇంటర్వెల్ సీన్ సూపర్ అంట..!

0
1437
Parasuram Planning Tight Script For Interval Bang In Mahesh Babu Starrer Sarkaru Vaari Paata

Sarkaru Vaari Pata movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ పూర్తి చేసిన సూపర్ స్టార్ ఇప్పుడు మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు. అందులో మొదటిది పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు కూడా ఈ మధ్యే లాంఛనంగా మొదలయ్యాయి. కథ రీత్యా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుండటంతో యూనిట్ అందుకు సన్నాహాలు చేస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ‘మహానటి’ కీర్తి సురేష్‌ కథానాయిక. బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ టాక్. అలాగే ఓ బ్యాంక్ ఆఫీసర్ గా అనుష్క నటించబోతున్నట్లు సమాచారం. సినిమా వర్గాలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.

‘గీత గోవిందం’తో ఇండస్ట్రీని ఆకట్టుకున్న పరశురామ్ డైరెక్టర్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో మహేశ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను మెప్పించేలా పరశురామ్ స్ర్కిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇందులో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్‌గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.ఇటీవల మహేశ్ నుంచి వస్తున్న సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక కోణాలను టచ్ చేస్తున్నాయి.

ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ సినిమాల్లో ‘ఒక్కడు’ సినిమా ఇంటర్వెల్ సీన్ ది బెస్ట్‌గా ఇప్పటికీ చెప్పుకుంటారు. దీంతో దానికి మించేలా ‘సర్కారు వారి పాట’ ఇంటర్వెల్‌ సీన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య వరసగా కమర్షియల్ సినిమాలతో పాటు అందులోనే సందేశం కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు మహేష్ బాబు. 2021 ఆగస్ట్, సెప్టెంబర్‌లోపు షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్‌లో కానీ లేదంటే 2022 సంక్రాంతికి కానీ విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.