Pareshan review in telugu: గత ఏడాది మంచి హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మాసూద చిత్రంతో హిట్ అందుకోవడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువిర్. అయితే ప్రస్తుతం అతను కామెడీ ఎంటర్టైనర్ పరేషాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరా ఆకట్టుకుందో తెలుసుకుందాం..
Pareshan review in telugu: రేటింగ్ : 2.25/5 – నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అబిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుడ్డరఖాన్ రవి, రాజు బెడిగెల – దర్శకులు : రూపక్ రోనాల్డ్సన్ – నిర్మాతలు: సిద్ధార్థ్ రాళ్లపల్లి – సంగీత దర్శకులు: యశ్వంత్ నాగ్
కథ : యువతరం స్టోరీ అంటేనే కాస్త అల్లరి చిల్లరిగా తిరిగే ఓ ఫ్రెండ్ బ్యాచ్ ఉంటుంది. అలాంటి బ్యాచ్ ఐసాక్(తిరువీర్) మరియు అతని ఫ్రెండ్స్ సత్తి, పాషా మైదక్. వీళ్లు ఎటువంటి పని పాట లేకుండా చిత్తుగా తాగి సింగరేణి ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. అతని తండ్రి ఒక సింగరేణి ఎంప్లాయ్.. పనీపాటా లేని కొడుకుకు ఎలాగన్నా ఉద్యోగం ఇప్పించాలి అన్న ఉద్దేశంతో భార్య గాజులు తాకట్టు పెట్టి రెండు లక్షల రూపాయల డబ్బు మధ్యవర్తికి ఇవ్వడానికి అరేంజ్ చేస్తాడు.
అయితే ఐసాక్ ఆ డబ్బును అవసరాల్లో ఉన్న అతని ఫ్రెండ్స్ సత్తి మరియు పాషా లకి తండ్రికి తెలియకుండా ఇచ్చేస్తాడు. సరిగ్గా అదే టైంకి ఐసాక్ లవర్ శిరీష ప్రెగ్నెంట్ అని డౌట్ వస్తుంది కాబట్టి పట్నం వెళ్లి పరీక్షలు చేయించాలి అంటే డబ్బు కావాలి. తన తండ్రికి తెలియకుండా మధ్యవర్తికి డబ్బులు అందివ్వాలి అన్న డబ్బు కావాలి.. ఇలా ఇబ్బందులు పడి సమకూర్చిన డబ్బు ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే అక్కడ ఎవరో దొంగతనం చేస్తారు. మరి ఆ డబ్బు తీసింది ఎవరు? ఐసాక్ తన చుట్టూ ఉన్న సిచువేషన్ ని ఎలా డీల్ చేశాడు…అనేది మిగిలిన కథాంశం.
విశ్లేషణ: గత కొద్దికాలం గా టాలీవుడ్ లో తెలంగాణ నేటివిటీ ఉన్న చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంది. పరేషాన్ మూవీ కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది. స్టార్టింగ్ టైటిల్ కార్డు దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు కంప్లీట్ తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన ఈ చిత్రం లో కొత్తదనం అయితే లేదు. మూవీ స్టార్టింగ్ లో కామెడీ యాంగిల్ బాగా హైలైట్ అయింది కానీ ఆ ఫ్లో కంటిన్యూ కాలేదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ పర్వాలేదు.. అయితే ఇంకొంచెం బాగా తీసి ఉండవచ్చు.
ఇక సెకండ్ హాఫ్ కాస్త సాగదీతగా బోరింగ్ గా అనిపించింది. మరి ముఖ్యంగా ఐసాక్ ఫ్రెండ్స్ సత్తి కోసం వెతికే సన్నివేశాలు బాగా డల్ గా ఉన్నాయి. కామెడీ పరంగా కొన్ని సీన్స్ మాత్రం కడుపుబ్బ నవ్విస్తాయి.. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా క్యాజువల్ గా సినిమా చూడడానికి వెళ్లిన వాళ్లకైతే మాత్రం ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్ :
*మూవీలో కామెడీ వినోదపరితంగా ఉంది.
*అక్కడక్కడ ఉన్న రొమాంటిక్ ట్రాక్స్ యూత్ కి కాస్త ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.
*ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజింగ్ స్టోరీ మీద కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఎలా ఉంది.
*తిరువీర్ యాక్షన్ చిత్రానికి మరో హైలెట్ అని చెప్పవచ్చు.
మైనస్ పాయింట్స్ :
*సెకండ్ హాఫ్ లో స్టోరీ బాగా డల్ గా ఉంది.
*తెలంగాణ నేటివిటీ మరీ ఎక్కువగా చూపించడంతో అవుట్ ఆఫ్ తెలంగాణ వాళ్లకు కాస్త చిత్రం అర్థం కాదు అనిపిస్తుంది.
*అక్కడక్కడ కామెడీస్ అన్ని వేశాలు బలవంతంగా తెచ్చి మూవీ క్యాతికిచ్చినట్లుగా ఉన్నాయి.
*సెకండ్ హాఫ్ లో కాస్త అనవసరం అనిపించే సీన్స్ ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా అవి ట్రిమ్ చేసి ఉంటే మూవీ మరింత బాగుండేది అనిపిస్తుంది.
సినిమాలో కామెడీ పర్లేదు కానీ ఎమోషన్ అస్సలు లేదు.
చివరి మాట: ఓవరాల్ గా తీసుకుంటే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ తో పరేషాన్ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే సాలిడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఈ చిత్రం కచ్చితంగా మిమ్మల్ని పరేషాన్ చేస్తుంది. ఫైనల్ గా ఇది ఒక యావరేజ్ రొటీన్ మూవీ అని చెప్పవచ్చు.