Pawan Tej Konidela, Ee Kathalo Patralu Kalpitham motion poster, Ee Kathalo Patralu Kalpitham

పవన్‌ తేజ్‌ కొణిదెలను హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఈ సినిమాలో మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌గా చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి నెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచేసింది చిత్రయూనిట్.

ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ… ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ షూటింగ్ పూర్తైందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పాడు. ఆర్టిస్టులు, టెక్నిషయన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోందన్నాడు. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణ ఔట్ పుట్‌ చాలా బాగా వచ్చిందని తెలిపాడు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి తమ సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయిందని ఆనందం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు చిత్రీకరించిన వరకు ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ కావడం చూస్తుంటే మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఈ మూవీ ఓ పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుందని అనిపిస్తోందంటూ చిత్ర నిర్మాత రాజేష్‌ నాయుడు రియాక్ట్ అయ్యారు.