Bold Scenes Between Naresh And Pavitra Lokesh: నరేష్ పవిత్ర లోకేష్ కాంబినేషన్లో వస్తున్న ముదురుతలహా లవ్ స్టోరీ చిత్రం మళ్ళీ పెళ్లి. దీనికి సంబంధించిన పెళ్లి సన్నివేశాన్ని నరేష్ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు దాదాపు ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అని తెగ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత ఇది రియల్ పెళ్లి కాదు రీల్ పెళ్లి అని తేలింది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు నటిస్తున్న ఈ చిత్రం గా మారింది. ఈ చిత్రం ఈనెల 26వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో హీరో హీరోయిన్ అయినా నరేష్ మరియు పవిత్రలోకేష్ ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు.
Bold Scenes Between Naresh And Pavitra Lokesh: ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పవిత్ర లోకేష్ మీడియాతో ముచ్చటించడం జరిగింది. తన కెరియర్ గురించి మాట్లాడుతూ కన్నడంలో లీడ్రోల్స్ లో నటిస్తున్న తను తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారానని చెప్పుకొచ్చారు. మళ్లీ పెళ్లి మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీలో ఓ రకంగా తనది హీరోయిన్ పాత్రే అని పేర్కొనడం విశేషం. ఈ సినిమా పూర్తిగా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పలు అంశాలకు దగ్గరగా చిత్రీకరించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు.
సమాజంలో అలాంటి సమస్యలతో నిజజీవితంలో బాధపడే వారికి ఈ చిత్రంలోని పాత్రలు బాగా కనెక్ట్ అవుతాయని. అయితే ఇది తమ జీవితానికి సంబంధించిన బయోపిక్ కాదు అని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ సినిమాకి స్ఫూర్తి యూట్యూబ్లో ఉండే పలు రకాల వీడియోలు అని కూడా పవిత్ర లోకేష్ చెప్పారు.

అంతేకాకుండా ఈ మూవీ డైరెక్టర్ అయిన ఎమ్మెస్ రాజు మైండ్ ఎప్పుడూ యూత్ ఫుల్ గా ఉంటుందని ఆయన ఆలోచనలు ట్రెండీగా నేటి తరానికి తగినట్టుగా ఉంటాయని ఆమె మెచ్చుకున్నారు.
మూవీ విషయానికి వస్తే.. కొన్ని సన్నివేశాలలో నిజాయితీని చూపించడం కోసం ప్రయత్నించామని అవి చాలా బోల్డ్‌గా ఉంటాయని పేర్కొన్నారు. ముదురు జంట చిత్రానికి సంబంధించిన పలు ప్రమోషన్ ఈవెంట్స్ లో హడావిడి చేస్తూ ఉన్నారు. మూవీ రిలీజ్ అయ్యాక కానీ అసలు చిత్రంలో ఉన్న రియాలిటీ ఏంటో ..,పవిత్ర లోకేష్ పేర్కొనే ఆ బోల్డ్ సీన్స్ ఏంటో క్లారిటీ వస్తుంది.
web title: Pavitra lokesh comments on bold scenes with Naresh details, Bold Scenes Between Naresh And Pavitra Lokesh Details Here Goes Viral In Social Media, Naresh , Pavitra Lokesh , Marriage , Remuneration