Pawan harish shankar #PSPK28 confirmed officially
Pawan harish shankar #PSPK28 confirmed officially

(Check out Power Star Pawan Kalyan up coming 2020 movies along with release dates.. after Pink movie Pawan harish shankar #PSPK28 confirmed officially)ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకు రావడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. అడపాదడపా ఎవరో ఒక్కరు తప్పితే మిగిలిన వారంతా పవన్ రీ ఎంట్రీని స్వాగతిస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ఫింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు. పవన్ ముచ్చటగా మూడో చిత్రాన్ని కూడా ప్రకటించేశారు. తనకు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో ఆయన మూడవ చిత్రం కమిట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ 28వ చిత్రంగా వస్తున్న చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించనున్నట్లు నేడు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్ధలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక హీరోయిన్ తోపాటు మిగతా నటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ లది క్రేజీ కాంబినేషన్. 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. హిందీ హిట్ మూవీ దబంగ్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం పవన్ ని ప్లాప్ ల నుండి బయటపడేసింది. అలాగే పవన్ కళ్యాణ్- క్రిష్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా ఆయన ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించారని తెలుస్తోంది. చార్మినార్, తాజ్ మహల్ లాంటి భారీ సెట్స్ వేసి చిత్రాన్ని రూపొందించేలా సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ మేరకు కొన్ని సెట్స్ కోసమే 25 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు టాక్.