పవన్-రానా మూవీ కి మాస్ టైటిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..!!

0
2547
Pawan Kalyan And Rana Movie Name Parushurama Krishna Murthy or Billa Ranga

Pawan Kalyan – Rana: మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికలుగా నిత్యామీనన్, ఐశ్వర్యరాజేశ్‌లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతారో అని అప్పుడు ఆసక్తి మొదలైంది. దీంతో ఓ ఫేమస్ టైటిల్ పెడతారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెకండ్ వేవ్ కంటే ముందు శరవేగంగా సాగిన ఈ చిత్ర షూటింగ్.. ఆ తరువాత వాయిదా పడింది. కాగా అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు, ఈ చిత్ర టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ‘బిల్లా-రంగా’ టైటిల్ ప్రచారంలో ఉండగా.. మరో టైటిల్ పేరు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రానికి “పరశురామ కృష్ణమూర్తి” అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.

ప్రస్తుతానికి ఈ వార్తపై ఇంకా ఎటువంటి క్లారిటీ టీమ్ నుంచి రాకపోయినా గాసిప్ గా రౌండ్ అవుతోంది. సినిమా కథ, సన్నివేశాలు కూడా వీరిద్దరి మధ్య నువ్వా.. నేనా అన్నట్టు సాగుతాయి. ఈ టైటిల్ తెలుగు నేటివిటీకి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. మరి సితార ఎంటర్ టైన్మెంట్స్, పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.