Homeసినిమా వార్తలుపోస్టర్లతోనే అంచనాలు పెంచేస్తున్న 'బ్రో' మూవీ..!!

పోస్టర్లతోనే అంచనాలు పెంచేస్తున్న ‘బ్రో’ మూవీ..!!

Pawan Kalyan and Sai Dharam Tej duo look released from 'Bro' Movie.. Bro Movie Release Date, Bro Movie Shooting update, Pawan Kalyan movie shooting details, Sai Dharam Tej latest movie shooting update

Pawan – Sai Dharam Tej first look from Bro: మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Pawan – Sai Dharam Tej first look from Bro: ఇక తాజాగా ఈ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ద్వయం కలిసున్న పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘బ్రో ద్వయం’ పేరుతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసున్న పోస్టర్ ను మే 29న ఉదయం 10:08 గంటలకు విడుదల చేశారు. బైక్ మీద ఒక కాలు పెట్టి పవన్ కళ్యాణ్ నిల్చొని ఉండగా, ఆయన మోకాలిపై చేతులు ఉంచి సాయి ధరమ్ తేజ్ నిల్చొని ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ చేతులపై పవన్ కళ్యాణ్ చేయి ఉండటం చూస్తుంటే నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా ఉంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కంటిచూపుతోనే దేన్నైనా శాసించగలరనే అంతలా శక్తివంతంగా కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ముఖంలో మాత్రం సున్నితత్వం ఉట్టిపడుతోంది. మొత్తానికి మామ-అల్లుడు ద్వయం పోస్టర్, సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. మే 18న ‘బ్రో’ టైటిల్ ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా విడుదల చేసిన ‘బ్రో ద్వయం'(Bro The Duo Poster) పోస్టర్ ఆ రెండు పోస్టర్లను మించేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోంది. ‘కార్తికేయ-2’, ‘ధమాకా’ వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో ‘బ్రో’ వంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) మొదటిసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం, పైగా ఇందులో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

Pawan Kalyan and Sai Dharam Tej duo look released from 'Bro' Movie

ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ‘బ్రో’ సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది.

ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి కానుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది.

- Advertisement -
Pawan Kalyan and Sai Dharam Tej duo look released from 'Bro'

Web Title: Pawan Kalyan and Sai Dharam Tej duo look released from ‘Bro’ Movie.. Bro Movie Release Date, Bro Movie Shooting update, Pawan Kalyan movie shooting details, Sai Dharam Tej latest movie shooting update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY