Homeసినిమా వార్తలుకిర్రక్ డాన్స్ కు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్

కిర్రక్ డాన్స్ కు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్

Pawan Kalyan and Sai Dharam Tej ready for Bro Song shoot, Bro Movie Song shoot details, Pawan Kalyan new movie shooting update, BRO movie latest news, BRO movie song shoot location, BRO movie business

Pawan Kalyan Bro Shooting update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ కాంబోలో వస్తున్న సినిమా బ్రో. ఈ మామ అల్లుళ్ళ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోద‌య సితంకి అనే మూవీ రీమేక్ ఈ బ్రో చిత్రం.

Pawan Kalyan Bro Shooting update: ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కి కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ చిత్రంపై హైప్ ని క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అయింది.

బ్రో మూవీలో ఓ పాప్ సాంగ్ చేయడం కోసం కాస్ట్ లీ పబ్ సెట్ ను నిర్మిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను మూవీ టీం సెలెక్ట్ చేసుకున్నారట. పవన్ సాయి ధరమ్ తేజ తో కలిసి ఈ బ్యూటీ వేసే చిందులు ఓ రేంజ్ లో ఉంటాయని టాక్. గత కొద్ది కాలంగా మాస్ బీట్ ఉన్న పాటలకు కాస్త డిమాండ్ ఎక్కువే అని చెప్పవచ్చు.

మొదట వాల్తేరు వీరయ్యలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేసింది ఆ తర్వాత వెంటనే అఖిల్ ఏజెంట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు తిరిగి మూడోసారి బ్రో సినిమాలో పబ్ సాంగ్ లో చేయడానికి మంచి ఆఫర్ పట్టేసింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఏ మూవీ కోసం ఇంత కాస్ట్లీ లుక్ తో ఉండే పబ్ సెట్ వేయలేదని తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించి కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

Pawan Kalyan and Sai Dharam Tej ready for Bro Movie Song shoot

అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయిన ఒక వ్యక్తి తాను చేయవలసిన కొన్ని పనులు మిగిలి ఉన్నాయని అందుకోసం మూడు నెలల సమయం కావాలని పైకి వెళ్లి దేవుడి దగ్గర వరం పొందుతాడు. దానికి ఓకే చెప్పడమే కాకుండా దేవుడు ఆ మూడు నెలలు దగ్గర ఉండి మరీ ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత కథలో ఏం జరిగింది? ఆ వ్యక్తి చేయాలి అనుకున్న పనులు పూర్తి చేశాడా? అనే విషయాల చుట్టూ కథ సాగుతుంది.

Web title: Pawan Kalyan ,Sai Dharam Tej ready for Bro Song shoot, Bro Movie Song shoot details, Pawan Kalyan new movie shooting update, BRO movie latest news, BRO movie song shoot location, BRO movie business

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY