రామ్ చరణ్, అల్లు అర్జున్ సాయంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్

275
Pawan Kalyan appreciates Ram Charan and Allu Arjun in a heartfelt note for supporting family of Kuppam tragedy

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే వేడుకల్లో భాగంగా భారీ కటౌట్ కడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాద ఘటన యావత్ పవన్ అభిమాన వర్గాలను కలచివేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప‌వ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ చనిపోయిన మృతుల కుటుంబాలకు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

అందులో భాగంగా అల్లు అర్జున్ చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తాని తెలిపాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన వంతుగా తలో 2.5 లక్షలను ఆర్థిక సాయం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అలాగే పవన్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మృతుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఆర్ధిక సాయం ప్రకటించి వారిని ఆదుకునే ప్రయత్నంలో భాగమయ్యారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు సాయం అందించిన వారికి పవన్ కళ్యా‌ణ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

అయితే తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ అందించిన సాయంపై రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్.. ”కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రామ్ చరణ్‌కి అలాగే పెద్ద మనుసుతో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్‌, నిర్మాతలు శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం, మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు నా కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు.