2022 సంక్రాంతి రేసులో పవన్ – రానాల “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్..?

0
108
Pawan Kalyan Ayyappanum Koshiyum remake gearing up for Sankranthi

Pawan kalyan: PSPK29: వకీల్ సాబ్ తో ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీఎంట్రీ తర్వాత వరుసగా భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ తో భారీ హిట్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్. కళ్యాణ్ నటించనున్న భారీ చిత్రాల జాబితాలో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ కూడా ఉంది. ఇందులో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో పవన్ భార్య పాత్రను నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ రానా భార్యగా కనిపించనున్నారు. మలయాళ హిట్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం అలాగే హరిహర వీరమల్లు సినిమాలు దాదాపు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసాడు. దాంతో ఈ సినిమాను 2021లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇది పవన్ అభిమానులకు టన్నుల కొద్దీ ఉత్సాహాన్ని ఇచ్చింది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.  ఈ చిత్రం 2022 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో కొంత ఆలస్యం జరిగింది. వచ్చే రెండు వారాల్లో యూనిట్ తిరిగి షూటింగ్ రీస్టార్ట్ చేయనుంది. మొత్తం చిత్రీకరణ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుంది.

అయితే టాలీవుడ్ బడా హీరోల చిత్రాలన్నీ దాదాపు సంక్రాంతిని టార్గెట్ చేస్తుంటాయి. పవన్ తో మహేష్ మాత్రం పోటీ పడటం గ్యారెంటీ అని తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే తెలుస్తోంది.  మరి ఈసారి సంక్రాంతి రేసులో ఈ చిత్రం కూడా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫైట్ తప్పదు.