పవన్ కళ్యాణ్ ‘’భవదీయుడు భగత్ సింగ్” ఫస్ట్ లుక్ అదుర్స్..!

0
127
Pawan Kalyan Harish Shankar Bhavadeeyudu Bhagat Singh Project Update

PSPK28 Bhavadeeyudu Bhagat Singh First Look Poster: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం పేరును ఈ రోజు ఉదయం 9.45 నిమిషాలకు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు చిత్ర దర్శక,నిర్మాతలు.

భవదీయుడు భగత్ సింగ్ ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే, ఆధునిక వాహనం పై కథానాయకుడు పవన్ కళ్యాణ్ జీన్స్, జర్కిన్ వస్త్ర ధారణలో ఓ చేతిలో టీ గ్లాస్,మరో చేతిలో స్పీకర్. స్టైలిష్ గా కూర్చొని ఉండటం కనిపిస్తుంది. కథాబలం,సన్నివేశాలలో భావోద్వేగాలు, పాత్రలమధ్య సంఘర్షణ, తూటాల్లాంటి మాటలు ఈ చిత్రం స్వంతమా అనిపిస్తుంది. ఖచ్చితంగా ‘భవదీయుడు భగత్ సింగ్’ వెండితెరపై ఓ చెరగని సంతకం అనిపిస్తుంది.

ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు మరోసారి అభిమాన ప్రేక్షకులను నిస్సందేహంగా ఉర్రూతలూగించనున్నాయి. ఒకటేమిటి మరెన్నో విశేషాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నాయి.

ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది అని తెలుపుతూ తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్.

Pawan Kalyan's Bhavadeeyudu Bhagat Singh First Look Poster out Now

ఈ చిత్రానికి అయనాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఇప్పటివరకు ఎంపిక అయిన ప్రధాన సాంకేతిక నిపుణులు.