Pawan Kalyan: భీం భీం భీం భీం భీమ్లానాయక్.. సాంగ్‌ అదిరిందిగా..!

0
47
Pawan Kalyan Bheemla Nayak Title Song out Now

Bheemla Nayak Title Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భీమ్లా నాయక్”. ఇందులో రానా దగ్గుబాటి మరో2హీరో. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. రిటైర్డ్ హవల్దార్ రోల్ లో రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకుంది.

నేడు పవన్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ మరో సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందించారు. ముందుగా ప్రకటించినట్లుగానే ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే జానపద గీతంతో మొదలయ్యే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.

‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ కు ఎస్ ఎస్ థమన్ ఫ్రెష్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల – శ్రీ కృష్ణ – పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు. లిరికల్ వీడియో అయినప్పటికీ విజువల్ గా గ్రాండ్ గా చూపించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ సాంగ్ లో థమన్ – శివమణి మరియు మిగతా టీమ్ అందరూ కలిసి పెరఫార్మ్ చేశారు.

ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.