Pawan Kalyan Birthday Special Treat from Vakeel Saab Team

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓ పక్క రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. పింక్ రీమేక్‌ వకీల్ సాబ్ (Vakeel Saab Motion Poster) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు మరియు బోణీ కపూర్ కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలకు సంబంధించి ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి వరుస అధికారిక అప్డేట్లతో రచ్చ లేపుతున్నాయీ.

రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటుదని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. ఈ సినిమాకి సంబంధించి రేపు ఉద‌యం 9 గం.ల 9 నిమిషాల‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు నిర్మాత‌లు బోని క‌పూర్, దిల్ రాజు ఆఫీషియల్‌గా ప్రకటించారు.

ఆ తర్వాత సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తన బ్లాక్ బస్టర్ కాంబో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిన్న ఆఫీషియల్‌గా వెల్లడించింది. అయితే పవన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా డబుల్ ధమాక అనే చెప్పాలి.