బ్రేక్‌ టైమ్‌లో భీమ్లానాయక్‌ ఇలా..!

0
263
Pawan Kalyan Break Time in Bheemla Nayak shooting photos

Pawan Kalyan BheemlaNayak: వరుస సినిమాలతో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భీమ్లానాయక్‌’తో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రానా-పవన్‌కల్యాణ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్న విరామం దొరకడంతో పవన్‌ గన్‌ చేతపట్టారు.

ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ అంటూ మీడియాకు విడుదలచేశారు. ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్.

Pawan Kalyan Break Time in Bheemla Nayak shooting photos

ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి,నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్’, ఇతర ప్రధాన పాత్రల్లో రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, నటిస్తున్నారు.

 

Previous article#Chiru153 Supreme Reveal On August 21st
Next articleImpressive First Single Padade.. Padade From Vishal ENEMY