Pawan name leaked from OG Movie: పవర్ స్టార్ లైన్ అప్ లో ఉన్న సినిమాలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. ఫేమస్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నట్లు తెలిసిందే. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ను ఎవరు చూడని డిఫరెంట్ యాంగిల్ లో ఈ మూవీలో చూపించబోతున్నారట. కొద్దిరోజుల క్రితం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పటికే 39 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది.
Pawan name leaked from OG Movie: లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి విలన్ గ్యాంగ్ చేజింగ్స్ అన్ని వేశాలని హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మూవీ టైటిల్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే విషయం అందరికీ తెలుసు అయితే దీని వెనక మరో అర్థం కూడా ఉందట…ఈ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు గాంధీ …ఓ అనేది ఈ మూవీలో అతని ఇంటిపేరుతో మొదలయ్యే మొదటి అక్షరం అనమాట.
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి అన్నా వదినల పాత్రలలో కిక్ శ్యామ్ మరియు శ్రీయా రెడ్డి కనిపించనున్నారు. ఈ మూవీలో శ్రియ రెడ్డి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ మరియు రఫ్ అండ్ టఫ్ గా ఉంటుందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ‘భగత్ సింగ్’ అనే ఫ్రీడమ్ ఫైటర్ పేరుతో కూడిన క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో కూడా గాంధీ పేరుతో క్యారెక్టర్ చేస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ వరుసగా ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లతో సినిమాలు తీయడం ప్రేక్షకులకు కాస్త సంతోషాన్ని ఇస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుల వీరుడు ‘ఇమ్రాన్ హష్మీ’విలన్ గా నటిస్తున్నారు.ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఒకపక్క ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోపక్క చెప్పిన టైంకి మూవీ షూటింగ్స్ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేథ్యంలో ఎలక్షన్స్ ఎఫెక్ట్ కోసం చిత్రాలలో ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు పెట్టుకుంటున్నారు అని విమర్శించే వారు కూడా ఉన్నారు.