మన తెలుగు హీరోలు సినిమా షూటింగు మొదలుపెట్టారు అంటే అది కంప్లీట్ చేయడానికి చాలా రోజులు టైం పడుతుంది. సినిమా విడుదల తేదీ ప్రకటించి షూటింగ్ కంప్లీట్ కాక మార్చిన రోజులు చాలా నే ఉన్నాయి. ఇక రాజమౌళి సినిమా అంటే సంవత్సరం పాటు హీరోలు ఆ సినిమాకి అంకితం అవ్వాల్సిందే.
ఇక టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి చాలా టైం పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ టాలీవుడ్ స్టార్ హీరోలు చేయలేని పనిని చేసి చూపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలు తన ఖాతాలో ఉన్న విషయం తెలిసిందే.
వాటి విషయానికి వస్తే, క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు దాదాపు సంవత్సరం పైనే షూటింగు జరుపుకుంటుంది. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగు ఏప్రిల్ రెండో వారం నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. అలాగే దీని తర్వాత ప్రభాస్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో OG సినిమా కూడా మే నెలలో షూటింగ్ మొదలవుతుందని ఫిలిం సర్కిల్ లో టాక్ నడుస్తుంది.
అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే వీటన్నిటి తర్వాత మొదలుపెట్టిన సినిమా PKSDT. సాయి ధరమ్ తేజ్ తో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సముద్రకని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని పవన్ కళ్యాణ్ నిన్నటితో కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ 22 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను బద్దలు కొట్టారు.
వినోదాయ సీతమ్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాని నిన్న మేకర్స్ పవన్ కళ్యాణ్ షూటింగు పూర్తి చేసినట్టు లొకేషన్ నుండి ఫోటోని విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ రోజుకు 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కి సమయం తక్కువ ఉండటం వలన మొదటిగా తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసినట్టు సమాచారం.
జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేయడంతోపాటు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తగిన మార్పులు చేశారు. ఈ సినిమాని జూలై 28న ప్రేక్షకులు ముందుకు రానుంది.