Homeట్రెండింగ్పవన్ చేసిన పనికి ఫిదా అవుతున్న పునీత్ ఫ్యాన్స్..!!

పవన్ చేసిన పనికి ఫిదా అవుతున్న పునీత్ ఫ్యాన్స్..!!

Pawan Kalyan donate 30 lakhs to Puneeth Raj kumar School, Power Star Pawan Kalyan ,30 Lakh Rupees Donation ,puneeth raj kumar school, Appu,

Pawan Kalyan – Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ గురించి సౌత్ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవరు ఉండరు. తను చేసిన సేవా కార్యక్రమాలు అలాగే తీసిన సినిమాలు తనని చిరకాలం గుర్తుండి పోయేలాగా చేశాయి. కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ సినిమా విడుదల అవుతుందంటే ఆరోజు పండగే. పవన్ కళ్యాణ్ మన తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎలా ఎదిగారు కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. అయితే అనుకోని కారణాలవల్ల చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం జరిగింది.

Pawan Kalyan – Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ ని కన్నడ ఇండస్ట్రీలో ముద్దుగా అప్పు అని పిలుచుకునేవారు. అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు ఒక్కొక్కటి తను చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చాయి. ప్రధాని మోడీ కూడా పునీత్ రాజ్ కుమార్ మరణానికి సంతాపం తెలియజేసిన విషయం తెలిసిందే. తను చేసిన సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే సౌత్ ఇండస్ట్రీలోనూ చాలామంది ముందుకు వచ్చి అండగా నిలుస్తున్నారు.

తను హీరోనేగా కాకుండా రియల్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ (Puneeth Raj kumar) చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళని దానం చేయడం జరిగింది. పునీత్ రాజ్ కుమార్ తో పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తనకి ఇష్టమైన హీరో అంటూ చాలా సార్లు చెప్పడం జరిగింది.. అలాగే ఇక్కడ హిట్ అయిన సినిమాలను రాజ్ కుమార్ అక్కడ కనడంలో తీసేవారు.

Pawan Kalyan donate 30 lakhs to Puneeth Raj kumar School

ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ కోసం పవన్ కళ్యాణ్ చేసిన సహాయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తను చేసే సేవా కార్యక్రమాల్లో ఒకటైన పేద విద్యార్థులకు చదువు చెప్పించడం కోసం అని పవన్ కళ్యాణ్ తన వంతు సహాయంగా 30 లక్షల రూపాయలు డొనేట్ చేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

ఇది తెలుసుకున్న పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పటమే కాకుండా మీది చాలా గొప్ప మనసు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కూడా తన గొప్ప మనసును చాటుకున్నారని చెప్పాలి.

Web title: Pawan Kalyan donate 30 lakhs to Puneeth Raj kumar School, Power Star Pawan Kalyan ,30 Lakh Rupees Donation ,puneeth raj kumar school, Appu,

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY