పవర్ స్టార్ తో సినిమా జాక్‌పాట్ కోటేసిన జానీ మాస్టర్

0
1675
Pawan Kalyan Movie Under Choreographer Jani Master Direction

తెలుగులో స్టార్ హీరోలకు కొరియో గ్రఫర్ గా జానీ మాస్టర్ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ని హుషారెత్తించే పాటలకు డాన్స్ ను కంపోజ్ చేయడంలో జానీ మాస్టర్ సిద్ధహస్తుడు. కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. అయితే, టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ మాస్టర్ కూడా దర్శకుడిగా మారుతున్నారనేది మూడేళ్ల క్రితం మాట. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను జానీ మాస్టర్ డైరెక్ట్ చేయబోతున్నారని 2017లోనే వార్తలు వచ్చాయి. దీనికి కారణం జానీ మాస్టరే.

పవన్ కళ్యాణ్‌కు జానీ మాస్టర్ వీరాభిమాని. పవన్ కళ్యాణ్ పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అందించారు. అయితే, పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని ఉందని.. ఎప్పటికైనా ఆయనతో సినిమా చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ అన్నారు. తాజాగా మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్ దర్శకత్వంలో నటించడానికి పవన్ కళ్యాణ్ పచ్చజెండా ఊపేశారట. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేయనున్న భారీ సినిమా పూర్తయిన తరువాత, ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

అయితే లాక్ డౌన్ కారణంగా ఆయన పవన్ ను కలవలేకపోయాడు. ఇక కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో, ఇటీవలే ఆయన పవన్ కల్యాణ్ ను కలిశాడని అంటున్నారు. ఈ కథ విన్న పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి అంగీకరించారని అంటున్నారు. పవన్ ఓకే చేయడంతో ఈ కథను రామ్ చరణ్‌కు కూడా వినిపించారట జానీ. చరణ్‌కు కూడా ఈ కథ నచ్చడంతో ఆయనే స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తానని జానీకి హామీ ఇచ్చారని టాక్.

దర్శకుడిగా కూడా జానీ మాస్టర్ ఎదగాలని కోరుకుంటూ పవన్ అభినందించాడని కూడా అంటున్నారు. ఈ రూమర్‌లో నిజమెంతో తెలీదు కానీ వినడానికి మాత్రం చాలా క్రేజీగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.