Homeసినిమా వార్తలుగాడ్ ఫాదర్ మరో మెగా ఈవెంట్ కి రంగం సిద్ధం.. పవన్ వస్తాడా..?

గాడ్ ఫాదర్ మరో మెగా ఈవెంట్ కి రంగం సిద్ధం.. పవన్ వస్తాడా..?

డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న విడుదలకు సిద్ధం చేశారు. అనంతపురం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఫాదర్ ట్రైలర్ ని విడుదల విడుదల చేయటం జరిగింది. ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి సత్యదేవ్ అలాగే నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో.

గాడ్ ఫాదర్ (GodFather) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా కానీ అది జరగలేదు. ముంబాయి లో  కూడా సల్మాన్ ఖాన్ గెస్ట్ గా ఒక ఈవెంట్  చేయాలనుకున్నారు కానీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తో సాధ్యం కాలేదు. అందుకే ముంబయి ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ (GodFather) మేకర్స్ దుబాయ్ లో భారీ ఎత్తున మెగా ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంట. ఈ సినిమా మేకర్స్ నుంచి అతి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం. అయితే ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ అలాగే సల్మాన్ ఖాన్ వస్తారని తెలుస్తోంది.

గాడ్ ఫాదర్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన చిరంజీవి టీం ఇప్పుడు ఈ ఈవెంట్ తో మరింత హైప్ ని తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పొలిటికల్ డ్రామా గా వస్తున్నా గాడ్ ఫాదర్ సినిమా కి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గాడ్ ఫాదర్ ఈవెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.  

 

Related Articles

Telugu Articles

Movie Articles