వీడియో: పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు’ వీడియో వైరల్

0
148
Pawan Kalyan Hari hara Veera Mallu Leaked Video Viral

Pawan Kalyan Hari Hara Veera Mallu: సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్పీడుతో దూసుకెళ్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ అభిమానులకు మహా శివరాత్రి కానుకగా విడుదల చేసిన నిర్మాతలు హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్‌కి సంబంధించి ఓ చిన్న ప్రోమో వీడియోను విడుదల చేయగా.. ఆ వీడియోకు పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన లభించింది.

కాగా ఇప్పుడు పవన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ మల్ల యోధులతో పోరాడే సన్నివేశాలుంటాయని ఇంతకుముందే సంకేతాలు అందాయి. పవన్ బరిసె పట్టుకుని పోజులిస్తున్న ఫొటోలు.. అలాగే మల్ల యోధుల ఫొటోలు అధికారికంగానే విడుదలయ్యాయి.

అయితే, చిత్ర యూనిట్ వెంటనే జాగ్రత్త పడడంతో అది ఇంటర్నెట్‌లో వైరల్ అవకముందే డిలీట్ చేసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కెరీర్‌లోనే తొలిసారి ఇలాంటి ప్రయోగం చేస్తున్నాడు పవర్ స్టార్.