Pawan Kalyan: బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న హరీష్

0
294
Pawan Kalyan, Harish Shankar Movie Update, Surprise For Fans On September 2nd

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan PSPK28) అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్  (Harish Shankar) దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు సోమవారం సాయంత్రం అప్‌డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం 4:05 గంటలకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీ ప్రకటిస్తారు.

మరోవైపు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘విరుపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కీరవాణి సంగీతం సమకూరుస్తు్న్నారు.

Previous articleRana Daggubati: యాక్షన్ అడ్వెంచర్ కి ఓకే చెప్పిన రానా !
Next articlePawan Kalyan Harish Shankar first look poster on this date