Homeసినిమా వార్తలు"పవర్ స్టార్" సరికొత్త రికార్డ్.. టాప్-6 హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే..!!

“పవర్ స్టార్” సరికొత్త రికార్డ్.. టాప్-6 హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే..!!

Pawan Kalyan is the only one from tollywood industry of the Top-6 Heroes to release a film in every year, Pawan Kalyan upcoming movies, Pawan Kalyan new movie release dates

Pawan Kalyan Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలు ప్రతి సంవత్సరం విడుదల కావడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. గత 3 – 4 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు సినిమాలు రెగ్యులర్ గా రిలీజ్ అవటం లేదు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే మిగతా సీనియర్ హీరోలు కూడా ప్రతి సంవత్సరం సినిమాని విడుదల చేయలేకపోతున్నారు.

ప్రభాస్ 2020 మరియు 2021 రెండు సంవత్సరాలు సినిమా విడుదల చేయకుండానే మిస్ అయ్యాడు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ దాదాపు 5 సంవత్సరాలు RRR సినిమా కోసం కష్టపడి చివరికి హిట్ కొట్టారు. అలాగే ఆ సినిమాతోనే ఆస్కార్ అవార్డు తీసుకురావడం జరిగింది. మహేష్ బాబు 2021లో సినిమాని విడుదల చేయలేదు. అలాగే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న SSMB28 రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

SSMB28 సినిమాని ఏప్రిల్ 11న విడుదల చేయడానికి మేకర్స్ ప్రకటించగా, ఇప్పుడు ఆ డేట్ ని సంక్రాంతి 2024 కి మార్చిపోతున్నట్టు ఇండస్ట్రీలో అయితే గుసగుసలు వినపడుతున్నాయి. ఇదే కనుక జరిగితే 2023 సంవత్సరంలో కూడా మహేష్ బాబు సినిమా మిస్ అయినట్టే.

ఇక అల్లు అర్జున్ 2021 సంవత్సరంలో పుష్పాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే దాని తర్వాత 2022 ఎటువంటి సినిమాని విడుదల చేయలేదు. మరి పుష్ప 2 విడుదల తేదీ మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అందరి మీద చూసుకుంటే టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే ప్రతి సంవత్సరం సినిమాలను విడుదల చేసుకుంటూ వస్తున్నారు.

2021లో కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, వకీల్ సాబ్‌ను విడుదల చేశాడు.. 2022లో భీమ్లా నాయక్‌ను విడుదల చేశారు అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న PKSDT సినిమాని జులై 28న విడుదల చేస్తున్నట్టు ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే 2024 సంవత్సరానికి కూడా రెండు సినిమాలను పవన్ కళ్యాణ్ షూటింగు జరుపుతున్నారు.

అయినప్పటికీ, కరోనా మహమ్మారి ప్రతి హీరో యొక్క సినిమా ప్రణాళికలన్నింటినీ తీవ్రంగా ప్రభావితం చేసినందున, ప్రతి సంవత్సరం వారి చిత్రాలను విడుదల చేయనందుకు ఇతర స్టార్ హీరోలను మనం నిందించలేము. ఒకవేళ కరోనా లేకపోతే హీరోలందరూ తమ తమ ప్లాన్‌ల ప్రకారం తమ సినిమాలను హ్యాపీగా రిలీజ్ చేసేవారు.

- Advertisement -

మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా షెడ్యూల్స్ ప్రభావితమైనప్పటికీ, పవన్ మాత్రం ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాని విడుదల చేస్తున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమే సినిమాలు దాని తగ్గట్టు తక్కువ రోజుల్లోనే షూటింగ్ ముగించడం వల్ల.. ప్రతి సంవత్సరం సినిమాలను విడుదల చేసే అవకాశాలు దొరికాయి.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY