‘విరూపాక్ష’ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

534
#PSPK27 Pawan Kalyan Krish Movie Title Update
#PSPK27 Pawan Kalyan Krish Movie Title Update

శివరాత్రి కానుకగా పవన్ సినిమా అప్ డేట్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడిక్ సినిమా షూటింగ్ జరుగుతోంది. గతవారం వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసిన పవన్ క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎమ్.రత్నం రూపొందిస్తున్న పిరియాడిక్ డ్రామా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

 

ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను శివరాత్రి కానుకగా ఫ్యాన్స్ కి అందించబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు క్రిష్‌. ప్రిపేరింగ్ ఫర్ టుమారో అంటూ క్రిష్ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్  లో ఉత్సాహాన్ని నింపింది.

 

ఈ సినిమాకు టైటిల్ గా ‘విరూపాక్ష’ అనే పేరు వినిపిస్తోంది. ఇప్పటికే  బ్యాక్ లుక్ పోస్టర్ తో క్యూరియాసిటీని నింపింది యూనిట్. మరి రేపటి అప్ డేట్ తో ఫ్యాన్స్ లో  ఇంకెంతటి ఆనందం తొణికిసలాడుతుందో చూడాలి.