Pawan Kalyan Krish PSPK 27 pre look poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు కానుకగా మరో సర్ పైజ్ పోస్టర్‌ వచ్చేసింది. ఇప్పటికే పవన్ రీ ఎంట్రీ మూవీ మోషన్ పోస్టర్ వీడియోతో అభిమానులు సంబరాల్లో ఉండగా.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 27 (PSPK27) మూవీ ప్రీ లుక్ విడుదలైంది.

పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడని అర్థం అవుతోంది. పవన్ పేస్ ని రివీల్ చేయకుండా ధీరత్వంతో నడుము మీద చేయి వేసుకుని నిలబడినట్లు చూపించారు. ఈ పోస్టర్ పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దర్శకుడు క్రిష్.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటకి కనిపిస్తుందని ఈ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘పవన్‌క‌ల్యాణ్‌గారు మీ 27వ చిత్రం పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌’’ అని క్రిష్ ట్వీట్ చేశారు క్రిష్.