Pawan Kalyan, Janasena Party, Ram Charan, Tollywood Movie News
Pawan Kalyan, Janasena Party, Ram Charan, Tollywood Movie News

అజ్ఞాతవాసి తరువాత పవన్ పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అయిపోయాడు.కానీ ఎలెక్షన్ రిజల్ట్స్ రావడానికిముందే పవన్ సినిమాల్లోకి తిరిగివస్తాడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది.ఇక ఇప్పుడు మాత్రం పవన్ రీ ఎంట్రీ ఎవరిచేతులమీదుగా జరుగుతుంది అనేది మాత్రమే తేలాల్సి ఉంది.

అయితే పవన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి ముందే చాల కమిట్మెంట్స్ ఉన్నాయి.మైత్రి మూవీ మేకర్స్,AM రత్నం,త్రివిక్రమ్ తో మరో సినిమా..ఇలా చాలా సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి.ఇప్పుడు సినిమాల్లోకి పవన్ రీ-ఎంట్రీ తప్పు అని చెప్పడానికి ఎవ్వరికి ఏ కారణాలు లేవు.జనసేన ప్రస్తుతానికి మాత్రం పాసివ్ స్టేజ్ లోనే ఉండాలి.మళ్ళీ జనాల్లోకి వచ్చేది నెక్స్ట్ ఎలెక్షన్స్ కి ఏడాదిముందో లేక రెండేళ్ళముందో మాత్రమే.మళ్ళీ పొలిటికల్ గా యాక్టివేట్ అయ్యేలోగా మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకోవడం అవసరం.అందుకే పవన్ పాత డీల్స్ పక్కనబెట్టి కొత్త డీల్స్ కి రెడీ అవుతున్నాడు అనేది మాత్రం నిజం.ఈ హింట్ తో చాలా ఫేక్ న్యూస్ సర్కులేట్ అవుతున్నాయి.బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా బోయపాటి డైరెక్షన్ లో పవన్ సినిమా అనే మాట వైరల్ గా మారింది.ఇది నిజం అయితే ఈ పాటికి బండ్ల గణేష్ చేసే అతికి అంతా అవాక్కయ్యేవాళ్ళు.పవన్ సినిమా అంటే బడ్జెట్ తక్కువ అనుకుంటే 80 కోట్లు.కానీ బోయపాటిని నమ్మి 50 కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా పెట్టడానికి ఎవ్వరూ రెడీ గా లేరు.ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ సొంతవాళ్లకే సినిమా చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కి పవన్ ఒక సినిమా చెయ్యాలని ఎప్పుడో అడిగి మాట కూడా తీసుకున్నాడు.ఇప్పుడు సైరా కూడా ఫినిషింగ్ లైన్ కి వచ్చింది.అందుకే పవన్,చరణ్,సూరి…ఈ కాంబినేషన్ కార్డ్స్ మీదకి వెళ్ళడానికి అవకాశాలు పుష్కంలంగా ఉన్నాయి.అందరిలా పవన్ కి సెకండ్ ఇన్నింగ్స్ కాదు…మరింత పెరిగిన ఇమేజ్ తో 2.0 లా వస్తున్నాడు.దీనికి మెగా స్టార్,మెగా పవర్ స్టార్ లాంటి ట్యాగ్స్ కూడా జతకలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి పవర్ ఫుల్ సునామీ గ్యారంటీ.ఏదైతేనే పవన్ తిరిగొచ్చాడు…పాత రికార్డ్స్ పగిలిపోవడం ఖాయం.