OG Movie Overseas Business: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు పొలిటికల్ గా అలాగే మరోవైపు సినిమాల్లో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం పొలిటికల్ వారాహి టూర్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో బ్రో సినిమా ఈ నెల 28న విడుదల అవుతుంది. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న OG సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కి ఈ సినిమా బిజినెస్ ఇప్పుడు పూర్తి అయిందంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
OG Movie Overseas Business: ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు.. అంచనాలకు అనుగుణంగా, OG ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి చెబుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే ఫ్యాన్ బాయ్ సుజిత్ దర్శకత్వంలో రావటంతో OG సినిమాకి అత్యంత క్రేజ్ ఏర్పడింది. OG ఓవర్సీస్ హక్కులు ₹18 కోట్లకు అమ్ముడయ్యాయి చెబుతున్నారు.. అంతేకాకుండా టాలీవుడ్ మూవీస్ లో ఓవర్సీస్ హక్కులు ఈ భారీ స్థాయిలో అమ్ముడుపోవటం మొదటిసారి అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, “OG” యొక్క ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాలేదు మరియు సినిమా విడుదల తేదీ ఇంకా తెలియలేదు.. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌కి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. దీనిని బట్టి చూస్తే రీమిక్స్ సినిమాలకన్నా పవన్ కళ్యాణ్ స్ట్రైట్ మూవీస్ కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుందని నిరూపించారు.

OG సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ కాకుండా మూవీ లవర్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా OG సినిమా షూటింగ్ లోకేషన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుంది. ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించిన డివివి దానయ్య ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తర్కెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ అలాగే రిలీజ్ డేట్ పై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.