Pawan Kalyan – OG Movie Song Shoot: ఓ పుష్కరకాలం ముందు పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ లో కనిపించారు. మళ్లీ తిరిగి ఇన్ని సంవత్సరాలకు ఓజీ (OG) చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఓజీ మూవీ పై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది పవన్ కళ్యాణ్ ఓజీ (OG) మూవీ కోసం.
Pawan Kalyan – OG Movie Song Shoot: సుజిత్ డైరెక్షన్ (Director Sujeeth) లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ నుంచి విడుదల అయిన ఒక్క ప్రీలుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది.మరి రాబోయే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ (Gangstar) క్యారెక్టర్ లో నటించిన చిత్రానికి హైలైట్ అనుకుంటే ప్రస్తుతం మూవీకి సంబంధించిన కొత్త అప్డేట్ మరింత హైప్ ని పెంచుతుంది.
ఇప్పటికే మూవీస్ సంబంధించిన షూటింగ్ సెరవేగం తో జరుగుతుంది.రెండు రోజుల క్రితమే ముంబై షూటింగు (Mumbai Shooting) కంప్లీట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – ప్రియాంక మోహన్ ఇప్పుడు రెండో షూటింగ్ షెడ్యూల్ ని ఈరోజు ప్రారంభించారు. మంగళవారం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు ప్రియాంకల (Priyanka Mohan) మధ్య ఓ పాట షూటింగ్ మహాబలేశ్వర్ లో స్టార్ట్ చేయటం జరిగింది. మూడు రోజులపాటు ఈ పాటకు షెడ్యూల్ ను కేటాయించినట్లు తెలుస్తుంది. మూడు రోజుల్లో ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించడానికి చిత్ర బృందం తగిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తుంది.
మంచి యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంతో తిరకేక్కుతున్నాయి చిత్రం కు చాలా ఫంకీగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ (Original Gangstar) అలియాస్ ఓజి (OG) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.ఆర్‌ఆర్‌ఆర్ లాంటి భారీ ఇండస్ట్రియల్ హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన దానయ్య ఈ మూవీకి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మొత్తానికి ఈ చిత్రం కోసం 60 రోజుల కాల్షీట్లు కేటాయించారు. శరవేగంతో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరం ఆఖరి కల్లా అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.