Pawan Kalyan OG Teaser Release Date: పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తన పొలిటికల్ టూర్ వల్ల కొన్ని సినిమాల షూటింగ్ ప్రస్తుతానికి హోల్డ్ చేసినట్టు తెలుస్తుంది. మొదటిగా పవన్ కళ్యాణ్ ప్లాన్ ప్రకారం హరిహర వీరమల్లు సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాలవల్ల అలాగే సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువ ఉండటంతో ఆ సినిమాని ప్రస్తుతం పొలిటికల్ టూర్ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ మొదలు పెడతామన్నట్టు ప్రొడ్యూసర్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పటం జరిగింది.
Pawan Kalyan OG Teaser Release Date: ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన బ్రో రీసెంట్గా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మిగతా సినిమాల విషయంలో ఒకరకంగా ఉంటే సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమా (OG Movie) ప్రస్తుతం భారీగా అంచనాన్ని పెంచేసింది. షూటింగ్ (Shooting) సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ ని ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా చేస్తున్నారు ప్రొడ్యూసర్ డివివి దానయ్య.
ఓజి సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. దర్శకుడు సుజిత్ ఓజి సినిమాకు సంబంధించిన షూటింగ్ ని పక్కా ప్లాన్ ప్రకారం అలాగే పవన్ కళ్యాణ్ టైమింగ్ బట్టి ముందుకు తీసుకు వెళుతున్నారు. ఓజి సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. సినిమా వర్గాల వారి నుండి అందుతున్న సమాచారం మేరకు ఓజీ షూటింగు 70% పైనే పూర్తయినట్టు తెలుస్తుంది.

షూటింగ్ మొదలుపెట్టిన మొదటి రెండు షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించడం జరిగింది. ఆ తరువాత దర్శకుడు సుజిత్ మిగతా తారాగణం పై చక్రీకరణ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సమాచారం మేరకు ఆగస్టు నెలలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఈ షెడ్యూల్లో పది రోజులు పాటు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం అందుతుంది.
షూటింగ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడం కోసం సుజిత్ ఓజి టీజర్ (OG Teaser) కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓజి టీజర్ (OG Movie Teaser) ని పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు విడుదల చేయుటకు దర్శకుడు అన్ని విధాల ప్లాన్ చేసినట్టు సమాచారమైతే అందుతుంది. అయితే ఈ టీజర్ కి కావాల్సిన కొన్ని షాట్లని ఈ ఆగస్టు మొదటి వారం ప్రారంభం కాబోయే కొత్త షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పై చిత్రీకరణ చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని అనుకున్న ప్లాన్ ప్రకారం డిసెంబర్లో విడుదల చేయటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు.