pawan kalyan pink remake pooja ceremony photos and videos
pawan kalyan pink remake pooja ceremony photos and videos

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు.ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.. దిల్ రాజు నిర్మాణంలో ‘పింక్’ రీమేక్ లో పవన్ నటిస్తున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. నాని తో ‘ఎం.సి.ఏ’ వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై అటు పవన్ కానీ.. ఇటు దిల్ రాజు కానీ క్లారిటీ ఇవ్వలేదు.

దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ తో సహా కొంత మంది తారాగణం ఈ కార్యక్రమానికి హాజరైనట్టు సమాచారం.దిల్ రాజు,భోనీ కపూర్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా నివేదా థామస్ ముఖ్యపాత్రలో నటిస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.