అఫీషియల్: సంక్రాంతి బరిలోకి పవన్ కల్యాణ్ క్రిష్‌ #PSPK27

417
Pawan Kalyan Krish movie releasing on Sankranthi 2022

చాలా కాలం బ్రేక్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన చిత్రం “వకీల్ సాబ్”. దాని తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌, డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు'(పరిశీలనలోని టైటిల్‌) #PSPK27. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించారు.

పవన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అప్పటికి ఫిక్స్ అయ్యిందని చెప్పాలి. అలాగే అజ్ఞ్యాతవాసి తర్వాత సంక్రాంతి రేస్ లో ఈ చిత్రం వస్తుండడం గమనార్హం.. మరి ఈ చిత్రంలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొఘల్‌ చక్రవర్తి జౌరంగజేబు కాలానికి చెందిన కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం గండిపేట ప్రాంతాన్ని, భారీ చార్మినార్ సెట్‌ను చిత్ర యూనిట్ నిర్మించింది.

ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ పేద ప్రజలకు అండగా నిలబడే బందిపోటు పాత్రలో కనిపిస్తాడు. జౌరంగజేబు పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నాడు. పీరియాడికల్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.