ఫస్ట్ గ్లింప్స్ తో చిత్తకొట్టిన భీమ్లా నాయక్!

0
1951
Pawan Kalyan Rana Bheemla Nayak First Glimpse out now

Bheemla Nayak: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎట్టకేలకు ఇప్పుడే సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుండీ అనుకుంటున్నట్లుగానే ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

భీమ్లా నాయక్ అంటూ ఇటీవల చిత్రబృందం చేస్తున్న సందడి మామూలుగా లేదు. ఆ పేరులోనే హై పంచ్ ఆకట్టుకుంది. మరి ఈ గ్లింప్స్ చూస్తే మాస్ పూనకాలు తెప్పించడం ఖాయం అనిపిస్తుంది. థీమ్డ్ ఆడియో.లాలా.. భీమ్లా.. అడవి పులి.. గొడవ పడి.. ఒడిసిపట్టు.. పిచ్చి కొట్టు.. అంటూ థీమ్ ని ఎలివేట్ చేసిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతే కాకుండా మాస్ డైలాగ్ తో ఊహించని ఫీస్ట్ నే ఇచ్చాడు.

Bheemla Nayak Glimpse out now

త్రివిక్రమ్ అందించిన డైలాగులు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో ఈ చిన్న టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో రానా పేరును కూడా ఈ టీజర్‌లో రివీల్ చేశారు. డానియల్ శేఖర్ అని రానా స్వయంగా వాయిస్ ఓవర్‌లో చెప్పాడు. మొత్తానికి అనుకున్నట్లుగానే భీమ్లా నాయక్ గ్లింప్స్ టీజర్ పగిలిపోయేలా ఉందని చెప్పాలి. పాత రికార్డులను ఈ టీజర్ తుడిచిపెట్టడం ఖాయమని పవన్ అభిమానులు అంటున్నారు.

Pawan Kalyan Rana Bheemla Nayak Title locked

ఇక ఈ సినిమా ఆడియో సాంగ్స్‌ను సెప్టెంబర్ 2 నుండి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ భీమ్లా నాయక్ మాస్ విశ్వరూపంతో పోరు హోరెత్తనుంది అని చెప్పి తీరాలి.

Click Here For Bheemla Nayak First Glimpse

పోల్ : ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ పై మీ అభిప్రాయం ఏమిటి..?