pawan kalyan record remuneration for his re entry Pink movie remake
pawan kalyan record remuneration for his re entry Pink movie remake

పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడా.. మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తాడా అని వేచి చూస్తున్నారు అభిమానులు. నిర్మాతలు కూడా ఈయన డేట్స్ కోసం కాచుకుని కూర్చున్నారు. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. మెగాస్టార్ తమ్ముడుగా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్… ఏ హీరోకి లేనంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా చూస్తున్నాడు అంటే దానికి మినిమం వసూళ్లు గ్యారంటీ. సినిమా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుని ముందుకు దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్.

మొన్నటికి మొన్న దిల్ రాజు అయితే కేవలం 25 రోజుల డేట్స్ ఇస్తే చాలు తాను సినిమా పూర్తి చేస్తానని చెప్పాడు. ఇక ఏఎం రత్నం లాంటి వాళ్లు కూడా మీకు వీలైనప్పుడు డేట్స్ ఇవ్వండి.. సినిమా పూర్తి చేస్తామంటున్నారు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే పవన్ కూడా పారితోషికం విషయంలో కొండెక్కి కూర్చున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈయన పింక్ సినిమా రీమేక్ చేయబోతున్నాడని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పుడెప్పుడో ఈ సినిమాపై న్యూస్ వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈయన కన్ఫర్మ్ అయితే చేయలేదు. దిల్ రాజు, బొనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

అయితే తాజాగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం కోసం పవన్ ఏకంగా రెమ్యునరేషన్ యాభై కోట్లు అడుగుతున్నారట. అయితే ఈ 50 కోట్ల రెమ్యూనరేషన్ డబ్బుల రూపంలో కాదని షేర్ రూపంలో పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్తున్నట్టు సమాచారం. పవన్ రీ ఎంట్రీ సినిమా అంటే కచ్చితంగా బిజినెస్ 130 కోట్లకు పైగానే జరుగుతుంది. అజ్ఞాతవాసితోనే పవన్ అప్పట్లో రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా తొలిరోజే 40 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అలాంటి ఇమేజ్ ఉన్న పవన్ కల్యాణ్‌కు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఎప్పుడూ రెడీగానే ఉంటారు.డిసెంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దీనికి లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.