రెమ్యునరేషన్ పెంచేసిన పవన్ కళ్యాణ్..!

0
278
Pawan Kalyan Remuneration Rs 60 Cr for Harish Shankar film

Pawan kalyan Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ప్రారంభంలో ‘వకీల్ సాబ్’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకుని అభిమానులకు బంపర్ ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి. ఈ సినిమాతో చాలా రోజుల తరువాత పవన్ సాలిడ్ రీఎంట్రీ ఇచ్చాడు. పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమాకు మాత్రం పవన్ రెమ్యునరేషన్ ఏకంగా 60 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. రీఎంట్రీలో పవన్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. మొత్తానికి పవన్ ఫుల్ బిజీగా ఉండటంతో ఆయన రెమ్యునరేషన్ పెంచడం కరెక్ట్ అంటున్నారు ఆయన అభిమానులు.

ఇక పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పవన్ ఈ సినిమాను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. హరీష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారనే విషయం తెలిసిందే. పవన్ చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉండటంతో వేగంగా సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Pawan Kalyan Remuneration Rs 60 Cr for Harish Shankar film

వచ్చే ఏడాది పవన్ హీరోగా తెరకెక్కుతున్న మూడు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లలో పవన్ సినిమాలు రిలీజవుతాయని ఈ మూడు సినిమాలు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో PSPK28, ‘భీమ్లా నాయక్’ ‘హరిహర వీరమల్లు’ ఇక ఈ సినిమాతో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేసేందుకు పవన్ సిద్ధమయ్యాడు.