Homeట్రెండింగ్HHVM: షూటింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. టార్గెట్ ఫిక్స్.!!

HHVM: షూటింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. టార్గెట్ ఫిక్స్.!!

Harihara Veera Mallu shooting Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా మా విడుదల చేయటం కష్టం అనే పుకార్లు వినపడ్డాయి. కానీ పవన్ కళ్యాణ్ వీటన్నిటికి పుల్ స్టాప్ పెడుతూ బుధవారం నుంచి షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Harihara Veera Mallu Update: సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే దీనితో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు (HHVM Shooting) సినిమా షూటింగ్ ఇప్పట్లో లో తిరిగి మొదలు పెట్టడం కష్టం అంటూ చాలా పుకార్లు వినపడ్డాయి. కానీ పవన్ కళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టి అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు చేశారు.

Nidhi Aggarwal and Pawan Kalyan Resume Hari Hara Veera Mallu Shooting

అలాగే హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి టార్గెట్ ఫిక్స్ చేసినట్లు కూడా సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దాదాపు ప‌దిహేను నుంచి ఇర‌వై రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుంద‌ని అంటున్నారు.

ఈ షూటింగ్ లో నిధి అగర్వాల్ కూడా పాల్గొన‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్ ని ఈ ఏడాది చివరి కల్లా కంప్లీట్ చేసి అనుకున్న తేదీకి విడుదల చేయాలని డైరెక్టర్ క్రిష్ టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో న్యూస్ ని వైరల్ చేశారు.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles