తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. రీసెంట్గా బ్రో సినిమాతో అలరించిన పవన్ కళ్యాణ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఓజి (OG Movie) సినిమాలు విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ లో బిజీ కావడంతో సినిమాలు షూటింగ్ కి పుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అయితే రీసెంట్ గా బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాకపోవటంతో పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
తాజాగా అందుతున్న వార్తల ప్రకారం హరీష్ శంకర్ అలాగే సుజిత్ దర్శకత్వంలో వస్తున్న రెండు సినిమాలు షూటింగు మళ్లీ మొదలు పెట్టాలని దర్శకులకి అలాగే ప్రొడ్యూసర్లకి పవన్ కళ్యాణ్ సూచనలు చేయడం జరిగిందంట. OG అలాగే Ustaad Bhagat Singh ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న OG సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ కోసం అక్టోబర్ నెలలో టీ మొత్తం విదేశాలకు వెళ్తున్నట్టు తెలుస్తుంది.
చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ విదేశాలలో షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభించడం ఇదే మొదటిసారి అవుతుంది. దీనికిగాను పవన్ కళ్యాణ్ అక్టోబర్ నెలలో 20 రోజులు కానీ అలాగే నవంబర్లో పది రోజులు డేట్స్ ఇచ్చినట్టు సినిమా వర్గాల వారి నుండి అందుతున్న సమాచారం. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చి ఇప్పటికే ఇచ్చినట్టు చెబుతున్నారు.

అయితే ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత షూటింగు అలాగే ప్రొడక్షన్ దిశలో ఆలోచించి వేరే డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది అలాగే OG సినిమాని కూడా అక్టోబర్ 22వ తారీకు విడుదల చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ ఇప్పుడు అది కూడా 2024 కి పోస్ట్ పోన్ అవటం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ షూటింగ్ ఆపేశారు అనే రూమర్స్ కి చెక్ పెడుతూ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి రెండు సినిమాలకు సంబంధించిన షూటింగు మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.